Introduction
Booth Level Officer- ఎన్నికల కమీషన్ ప్రతి అర్హత కలిగిన పౌరుడికి ఓటరు కార్డు కల్పించడడంతో పాటు దాని యొక్క వినియోగాలపై కూడా ఎప్పటికప్పుడూ ఎన్నికల సమయాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తూ వుంటారు.అదే సమయంలో ప్రతి గ్రామానికి/ వార్డుకి సంబంధించి ఒక Booth Level Officer ని నియమిస్తూ వుంటారు.కనుక ఇప్పుడు జులై 21 వ తేదీ నుండి ఆగష్టు 21 వ తేదీ వరకు ఓటరు కార్డు వెరిఫికేషన్ జరుగుతుంది.కనుక ఈ వెరిఫికేషన్ అయ్యాక జనవరి 5 వ తేదీ ఫైనల్ లిస్ట్ రిలీజు చేస్తారు,కావున ఈ వెరిఫికేషన్ చాలా కీలకం కనుక మీ ఓట్లు లిస్ట్ లో ఉన్నాయా లేదా మీ Booth Level Officerదగ్గర చెక్ చేసుకోండి. ఈ పేజీ నందు మనము ఇప్పుడు ఈ Booth Level Officer ని ఏ విధంగా కనుక్కోవాలి మరియు వారి యొక్క మొబైల్ నెంబర్ కూడా ప్రభుత్వం అధికారిక website లో అందుబాటులో ఉంచింది.కనుక ఈ విషయాలన్నిటిని చాలా వివరంగా ఇప్పుడు చెప్పుకుందాం.
Booth Level Officer యొక్క విధులు ఏమిటి ?
ఈ BLO లు యొక్క ప్రధాన కర్తవ్యాలు గురించి కొంచెం వివరంగా చెప్పుకుందాం.
- 18 సంవత్సరాల వయస్సు కలిగిన వారికీ ఫీల్డ్ వెరిఫికేషన్ లో ఉచితంగా BLO లాగిన్ నందు ఓటు హక్కును నమోదు చేయించాలి.
- ఓటరు కార్డు లో తప్పులు ఏమైనా సరిదిద్దుకోవాంటే కూడా చేస్తారు.
- ఓటరు కార్డు ని ఒక చోట నుండి మరొకచోటికి మార్పు చేయదలచిన చేసి ఇస్తారు
- ఓటరు కార్డు కి ఆధార్ నెంబర్ లింక్ చేస్తారు.
- ఓటరు కార్డు కి మొబైల్ నెంబర్ లింక్ చేస్తారు.
- ఓటరు కార్డు లో అభ్యంతరాలు వుంటే పరిశీలిస్తారు.
- ఓటరు కార్డు పోగొట్టుకుని ఉంటే మరల రీ ప్రింట్ కి దరఖాస్తు చేయిస్తారు.
- చనిపోయిన వారిని ఓటరు లను లిస్ట్ నుండి తొలగిస్తారు.
- ఒకే వ్యక్తికి రెండు,మూడు చోట్ల ఓటరు కార్డు లు ఉంటే పరిశీలన చేసి ఓటరు కోరుకున్న చోట పెట్టి,మిగిలిన చోట తొలగిస్తారు.
- ఓటు హక్కు పై ప్రజలలో అవగాహన పరుస్తారు.
- ఎన్నికల సమయంలో ఓటరు స్లిప్ లను పంచుతారు.
Know Your Booth Level Officer
(మా BLO ని ఎలా కనుగొనాలి)
దీనికి సంబంధించి కేంద్రప్రభుత్వం సులభంగా మీకు కేటాయించిన BLO యొక్క పేరు,మొబైల్ నెంబర్ ను ఎప్పుడూ అధికారిక వెబ్సైటు నందు ప్రజలకు అందుబాటులో ఉంచుతారు.కనుక దానికి ఏ విధంగా తెలుసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
1) ముందుగా దీనికి సంబంధించిన లింక్ క్రింద ఇవ్వబడుతుంది.కనుక ముందుగా అక్కడ క్లిక్ చేసుకోగలరు.
LINK – CLICK HERE
పై లింక్ ఓపెన్ చేసుకున్నాక ఈ క్రింది విధంగా పేజీ ఓపెన్ అవుతుంది.అక్కడ మీ ఓటరు కార్డు నెంబర్ గానీ లేదా మీ కుటుంబంలో వారిదైనా లేదా మీ గ్రామంలో ఎవరిదైనా అక్కడ ఎంటర్ చేసి దాని క్రింద వున్నా CAPTCHA ని తప్పులు లేకుండా ఎంటర్ చేసిన తరువాత Search బటన్ పై క్లిక్ చేయగానే క్రింది ఫోటో లో చూపించిన విధంగా మీకు సంబంధించిన Booth Level Officer ఎవరు,వారి పేరు,మొబైల్ నెంబర్ మరియు వారితో పాటు వారి పై అధికారి అయినా D.E.O (జిల్లా కలెక్టర్) యొక్క కాంటాక్ట్ వివరాలు కూడా DISPLAY అవుతాయి.కనుక అక్కడ నుండి వారిని కాంటాక్ట్ అయ్యి మీ ఓటరు కార్డు కి వున్న సమస్యలను సరిదిద్దుకోవచ్చును.
అధికారులు సరిగ్గా స్పందిచకపోతే ఎవరికీ చెప్పుకోవాలి?
గ్రౌండ్ స్థాయిలో వున్నా Booth Level Officer సరిగ్గా స్పందిచకపోతే వారి పై స్థాయిలో ఉన్నటువంటి ERO, DEO లకి పై నంబర్లు కి కాల్ చేసి చెప్పుకోవచ్చును.వారికీ సంబంధించి వివరాలను కూడా ఏ విద్మగా తెలుసుకోవాలో పైన వివరించాను, కావున క్షుణ్ణంగా తెలుసుకోగలరు.
TOLL FREE NUMBER – 1800111950
ఈమెయిల్ – complaints@ eci.gov.in
FAQs
- క్రొత్త ఓటరు కార్డు కొరకు వయస్సు 18 సంవత్సరాలును ఏ తేదీకి పరిగణిస్తారు?
జ) ఎన్నికల కమీషన్ చెబుతున్న విధంగా జనవరి1, 2024 కి 18 సంవత్సరాలు ఎవరికైతే పూర్తి అవుతాయో అట్టి వారు మాత్రమే క్రొత్త ఓటరు కార్డు నమోదుకు అర్హులు.
Related Links
క్రొత్తగా ప్రారంభించిన ఓటరు కార్డు వెబ్సైటు లో ఉన్న ప్రజలకు ఉపయోగపడే అంశాలు ఇవే
మీ ఆధార్ నెంబర్ ని మొబైల్ నెంబర్ తో ఎలా తెలుసుకోవాలి
Conclusion
ఈ పేజీ లో మనము ప్రజలకు ఓటరు కార్డు కి సంబధించిన ఎటువంటి సమస్యలు వున్నా దానిని ఏ విధంగా సరిచేసుకోవాలి అనే విషయాన్ని మరియు మనకు సంబంధించిన Booth Level Officer ని ఏ విధముగా తెలుసుకుని వారి దగ్గర వున్నా ఓటరు కార్డు సమస్యలను ఏ విధంగా క్లియర్ చేసుకోవాలో అని చాలా వివరంగా చెప్పడం జరిగింది.కనుక మీకు ఇంకా ఏమైనా సందేహాలు వున్నచో ఈ క్రింది వాట్సాప్ గ్రూప్ లో అయ్యి తెలుసుకోగలరు.