New voter card Website 2023

4.4/5 - (25 votes)

Introduction

      కేంద్ర ఎన్నికల కమీషన్ Voter card లకు సంబంధించి అన్నిసర్వీసులును సులభరీతిగా ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశ్యంతో పాత Voter card website ని క్రొత్తగా  మార్పులు చేసి New voter card website ని ప్రవేశపెట్టింది.కనుక ఈ పేజీ నందు మనం ఈ New voter card website లో ప్రజలకు ఎన్నిరకాల సర్వీసులు ఉన్నాయో అని వివరంగా విశ్లేషించుకుందాం. కనుక ఈ పేజీలో ఇచ్చిన ప్రతి సమాచారం పాఠకులకు ఎంతగానో ఉపయోగపడుతుందని భావిస్తున్నాను.ఇదే కాకుండా voter card లకు సంబంధించిన DEMO VIDEOS అన్నీ కూడా అందుబాటులో వుంచుతాను.కాబట్టి ఏ సర్వీసు అయినా ఎలా చేసుకోవాలో సందేహం వున్నా కూడా మీరే  మీ ఫోన్ లో చేసుకోవచ్చు.కనుక దీనివల్ల సమయం వృధా కాదు మరియు డబ్బులు కూడా వృధాకాకుండా మిగులుతుంది.

గమనిక: ఈ పేజీ ని మీ సౌకర్యార్ధం మీకు అర్ధమయ్యే భాషలో క్రింద ఇచ్చిన Translate అనే ఆప్షన్ ద్వారా చదువుకోవచ్చు.

DEMO VIDEOS FOR VOTER CARDS : Click here 

న్యూ ఓటరు కార్డు కి సంబంధించి లింక్ ని పేజీ చివరన ఇచ్చాను. కావున అక్కడ చెక్ చేసుకోగలరు 

New voter card website Dash Board 

New voter card website

 

New voter card website నందు (1) FORMS (2) Services  ఉంటాయి.

 

(1) FORMS

A) New Registrations For General Election అని మొదటి అప్షన్ ఉంటుంది. ఇక్కడ FORM 6 కి సంబంధించిన ఆప్షన్ ఉండి పౌరుడి కి 18 సంవత్సరాలు వచ్చి వున్నాలేదా 18 సంవత్సరాలకు కొన్ని నెలల ముందుగా అంటే 17 సంవత్సరాలు (న్యూ అప్డేట్ ప్రకారం) వయస్సు వున్నా కూడా New voter card కొరకు దరఖాస్తు చేసుకోవచ్చును.కావున ఎవరైనా New voter card కి apply చేసుకోవాలంటే ఈ ఆప్షన్ ని ఎంచుకుని Apply మీరే చేసుకోవచ్చను.

GuidelinesClick here  

Website Link (Login Must) : CLICK HERE

 

B) New registration for overseas(NRI) electors: ఇందులో FORM 6A ఆప్షన్ ఉంటుంది.ఇది భారతదేశానికి వాళ్ళు బయట దేశాలలో నివసిస్తున్న వాళ్ళు ఇక్కడ ఓటు హక్కు కొరకు దరఖాస్తు చేసుకోవాలంటే ఈ ఆప్షన్ ని ఎంచుకోవాలి.

Guidelines  – CLICK HERE 

Website Link (Login Must) : CLICK HERE

 

C) Adhar to Voter card link: ఈ ఆప్షన్ అనేది voter card కలిగిన ప్రతి ఒక్కరూ కూడా voter card కే ఆధార్ లింక్ చేసుకోవాలి.తద్వారా దొంగ ఓట్లను ఏరివేయటమే కాకూండా చాల పారదర్శకంగా ఎప్పుడైనా ఎక్కడైనా మన కార్డు ని ఆధార్ నెంబర్ తోనే Download చేసుకునే అవకాశం ఉంటుంది.

 

D) Objection for proposed inclusion/deletion of name in existing roll: ఈ ఆప్షన్ నందు voter card సంబంధించి ఎవరైనామరణించినా లేదా ద్వంద కార్డులు వున్నా అలంటి వాటిని ఈ FORM 7 ద్వారా తొలగించే ఆప్షన్ ఉంటుంది.

Guidelines –CLICK HERE

Website Link (Login Must)  : CLICK HERE  

 

E) Shifting of residence/correction of entries in existing electoral roll/replacement of EPIC/marking of PwD: ఈ ఆప్షన్ నందు voter card లో ఏదైనా తప్పులు దొర్లి వుంటే వాటిని సరిచేసుకోవచ్చును.మరియు వారి voter card ఎక్కడికైనా పోగొట్టుకుని ఉంటే మళ్ళీ Replacement పెట్టుకోవచ్చును.మరియు విభిన్న ప్రతిభావంతులు ఓటు వేయడానికి సహకారం అందిచడానికి,ఎలక్షన్ కమీషన్ కి అభ్యర్ధన పెట్టుకోవచ్చును.

Guidlines : CLICK HERE  

Website Link (Login Must) : CLICK HERE

 

2) SERVICES

 

New Voter card

A) Track Your Application status: ఈ ఆప్షన్ నందు పైన తెలిపిన FORM-6, FORM-6B, FORM-7,FORM-8 కి సంబంధించి ఏ అప్లికేషన్ మీరు పెట్టునా ఒక Reference నెంబర్ వస్తుంది.దాని ద్వారా మన అప్లికేషన్ Approved అయిందా Reject అయిందా అని మనమే మన ఫోన్ లో చెక్ చేసుకునే వెసులుబాటు కలదు.

 

B) Search In Electoral Roll: ఈ ఆప్షన్ నందు ఎటువంటి లాగిన్ లేకుండా మీ voter card లో వున్నవిధంగా వివరాలు ఇచ్చి మీ voter card నెంబర్ ని తెలుసుకోవచ్చును.కనుక ఈ ఆప్షన్ చాల మందికి ఉపయోగపడుతుంది.ఇక్కడ ఇబ్బందికర విషయం ఏమిటంటే మీ voter card లో వున్న విధంగా పేరు,ఇంటి పేరు,తండ్రి పేరు,చిరునామా కరెక్ట్ గా ఎంటర్ చేస్తేనే వస్తుంది.లేదంటే సరైన వివరాలు చూపించదు.ఇంకామీకు సులభతరంగా కావాలంటే మీ ఏరియా voter card list ని Download చేసుకుని అందులో మీ కుటుంభం సభ్యుల voter card లోని సీరియల్ నెంబర్ ప్రక్కన ఉంటుంది కనుక ఈ విధముగా సులభంగా తెలుసుకోవచ్చును.ఇలాంటి వీడియోస్ అన్నీ కావాలనుకుంటే Youtube లో Maddimadugu Munirathnam అనే ఛానల్ లో voter card Playlist నందు ఇచ్చి వున్నాను.

WebsiteLink: CLICK HERE 

 

C) Know Your Polling Station & Officer: ఈ ఆప్షన్ నందు మీ voter card కి సంబంధించిన అధికారి BLO (Booth Level Officer) మరియు జిల్లా స్థాయిలో ఉన్నటువంటి ఎలక్షన్ కి సంబంధిచిన ఉన్నత అధికారులు యొక్క పేర్లు మరియు వారి మొబైల్ నంబర్స్ అందుబాటులో ఉంటాయి.కనుక మీకు voter card కి సంబంధించి apply,Correction,Replacement ఇలా ఏ సర్వీస్ కి పెట్టుకున్నా మీ BLO కి కాల్ చేసి సమస్యని పరిష్కరించుకోవచ్చును.

Website LinkCLICK HERE 

BLO Booth Level Officer

D) Epic Download: ఈ ఆప్షన్ అందరికి కూడా ఉపయోకరంగా ఉంటుంది.ఎందుకంటే ఎలక్షన్ కమీషన్ ఇప్పుడు తెచ్చిన క్రొత్త voter card ని Download చేసుకోవాలంటే ఈ ఆప్షన్ ద్వారా సులభంగా చేసుకోవచ్చును. ఈ Voter card ని Downlaod చేసుకోవాలంటే మాత్రం గుర్తించుకోవాల్సిన అంశం ఎమిటంటే మొబైల్ నెంబర్ ఖచ్చితంగా లింక్ ఉంటేనే ఈ సర్వీసుని వాడుకోవచ్చును.ఒకవేళ నెంబర్ లింక్ లేకపోతే FORM 7 ద్వారా లింక్ చేసుకుని తరువాత voter card ని డౌన్లొడ్ చేసుకోవచ్చును.దీనిని ఎలా Downlaod చేసుకోవాలని మన Munirathnam Maddimadugu Youtube ఛానెల్ లో పెట్టి వున్నాను కనుక ఆసక్తి మరియు అవసరం వున్నఎవరైనా వాటిని చూసి voter card పై ఎలాంటి సందేహం వున్నా సరిచేసుకోవచ్చును. 

New vote card Website: CLICK HERE

 

Related Links

 

New voter card Website 

Job Notifications 

Ysr New Pension kanuka status check 

Ysr Raithu barosa payment status check 

 

Share to Help

1 thought on “New voter card Website 2023”

Comments are closed.