High-paying Indian Air Force Jobs in 2023: A Comprehensive Guide

4/5 - (5 votes)

Introduction

 

  దేశ రక్షణలో ప్రధాన పాత్ర పోషించే ఉద్యోగాలలో ఒకటి అయినా Indian Air force వంటి వాటిలో చేరాలని కోరుకుంటున్న యువత కి ఇది చక్కటి అవకాశం.ఈ 2023 సంవత్సరానికి సంబంధించి ప్రస్తుతం 276 పోస్టుల కొరకు నోటిఫికేషన్ జారీ చేశారు.ఈ ఉద్యోగాలకు జాతీయ స్థాయిలో నిర్వహించే పోటీ పరీక్షల్లో విజయం సాధించాల్సి ఉంటుంది.దీనిలో ఉద్యోగం పొందిన వాళ్ళు మంచి భత్యాలను పొందే అవకాశం ఉంటుంది.కనుక ఆసక్తి వున్నావారు తప్పకుండ తప్పకుండా దరఖాస్తు చేసుకోగలరు.

Indian Air force Jobs (Good Salary)-2023

Total Posts – 276

 

ఈ పోస్టుల రకాలు

 

  1. ప్లయింగ్  బ్రాంచ్
  2. ఏరోనాటికల్ ఇంజినీర్స్ (ఎలక్ట్రానిక్స్)
  3. ఏరోనాటికల్ ఇంజినీర్స్ (మెకానికల్)
  4. గ్రౌండ్ డ్యూటీ వెపన్ సిస్టమ్స్  NCC
  5. గ్రౌండ్ డ్యూటీ అడ్మినిస్ట్రేషన్ అండ్ లాజిస్టిక్స్
  6. గ్రౌండ్ డ్యూటీ – అకౌంట్స్
  7. గ్రౌండ్ డ్యూటీ ఎడ్యుకేషన్ బ్రాంచ్
  8. గ్రౌండ్ డ్యూటీ మేటీయరాలజీ
  9. NCC స్పెషల్ ఎంట్రీ స్కీం (ప్లేయింగ్ బ్రాంచ్)

 

అర్హతలు ఈ క్రింది విధంగా ఉండాలి

 

ప్లయింగ్  బ్రాంచ్: ఈ పోస్టుకి ఇంటర్ MPC లో 60% మార్కులతో పాటు BE / B,tech కూడా పాస్ అయి ఉండవలెను.

 

ఏరోనాటికల్ ఇంజినీర్స్ (ఎలక్ట్రానిక్స్): ఈ ఉద్యోగానికి Be/B tech వాళ్ళు 60% మార్కులుతో పాస్ అయివుంటే దరఖాస్తు చేసుకోగలరు.

 

ఏరోనాటికల్ ఇంజినీర్స్ (మెకానికల్): ఈ పోస్ట్ నకు B.tech 60% మార్కులతో పాటు ఏరోస్పెస్,ఏరోనాటికల్,ఎయిర్ క్రాఫ్ట్ మెయింటైనన్స్,మెకానికల్, మెకానికల్ ఇంజనీరింగ్ అండ్ ఆటో మేషన్ ,ప్రొడక్షన్,మెకాట్రానిక్స్,పరిశ్రమల ఇంజినీర్,మ్యానుఫ్యాక్చరింగ్, ప్రొడక్షన్ అండ్ ఇండస్ట్రియల్ ఇంజినీర్,మెటీరియల్ సైన్స్,మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్, ఏరోస్పేస్ అండ్ అప్లయిడ్ మెకానిక్స్,ఆటోమోటివ్,రోబోటిక్స్,నానో టెక్నాలజీ, రబ్బర్ టెక్నాలజీ మరియు రబ్బరు ఇంజినీరింగ్ బ్రాంచైలలో చదివి ఉండవలెను.

INDIAN AIR FORCE

 

గ్రౌండ్ డ్యూటీ వెపన్ సిస్టమ్స్ : ఈ ఉద్యోగం పొందుటకు ఇంటర్మీడియట్ లో ఎంపిసి  గ్రూప్ నందు 50% మార్కులు పొంది ఆ తరువాత డిగ్రీ నందు కూడా 60% మార్కులతో పాస్ అయిన వారు దీనికి అర్హులు.

 

గ్రౌండ్ డ్యూటీ అడ్మినిస్ట్రేషన్ అండ్ లాజిస్టిక్స్ : ఈ ఉద్యోగానికి బ్యాచిలర్ డిగ్రీ లో 60% మార్కులతో పాస్ అయినా వారు అర్హులు..

 

గ్రౌండ్ డ్యూటీ – అకౌంట్స్: ఈ ఉద్యోగానికి డిగ్రీలో B,com / BBA / BBM / BBS (ఫైనాన్స్ ప్రత్యేక సబ్జెక్టు కలిగి ఉంటే),లేదా CA / CMA/ CS/ CFA లలో పాస్ అయి ఉండాలి.

 

గ్రౌండ్ డ్యూటీ ఎడ్యుకేషన్ బ్రాంచ్: ఈ ఉద్యోగానికి 50% మార్కులతో PG తో పాస్ అయి ఉండాలి.

 

గ్రౌండ్ డ్యూటీ మేటీయరాలజీ: ఈ జాబ్ నకు డిగ్రీ లో BSC (ఫిజిక్స్,మాథ్స్) చదివిన వారు అర్హులు లేదా BE / Btech  లో అయినా 60% తో పాస్ ఉండాలి.

 

NCC స్పెషల్ ఎంట్రీ స్కీం (ప్లయింగ్ బ్రాంచ్): NCC ఎయిర్వింగ్ సీనియర్ డివిజన్ ‘C’సర్టిఫికెట్ తో వున్నా అభ్యర్థులకు అవకాశం కలదు.కావున వీరికి NCC సర్టిఫికెట్ తో పాటు ఏదైనా డిగ్రీ లో 60% మార్కులు ఉండాలి.ఇక్కడ తప్పకుండా ఇంటర్మీడియట్ లో మాథ్స్ ,ఫిజిక్స్,లో 60% మార్కులతో తప్పక పాస్ అయి ఉండవలెను.

 

ఈ జాబ్ లకు వయస్సు అర్హతలు

 

ప్లేయింగ్ బ్రాంచ్ ఉద్యోగానికి 2004,జులై 1 వ తేదీ నాటికీ వారికీ 20 నుండి 24 మధ్య వయస్సు కలిగి ఉండాలి.ఇక్కడ కమర్షియల్ పైలట్ లైసెన్స్ కలిగి వుంటే మరో 2 సంవత్సరాలు మినహాయింపు కలుగుతుంది.

గ్రౌండ్ డ్యూటీ పోస్టనకు 2004,జులై 1 వ తేదీకి 20 నుండి 26 సంవత్సరాలు కలిగి ఉండాలి.

 

గమనిక: ఇక్కడ అన్ని ఉద్యోగాలకు వివాహం అయిన వాళ్ళు అనర్హులు.

 

Also Read This Article : AP IIIT Notification

Also Read This Article : ISRO Job Notification 2023

 

 

పరీక్షా విధానము(మొదటి దశ )

 

ఈ ఉద్యోగాల కొరకు మొదటి రౌండ్ లో Indian Air force పరీక్ష లో 300 మార్కులకు జరుగుతుంది. అందులో 1) జనరల్ అవైర్నెస్ 2)ఇంగ్లీష్ వెర్బల్ ఎబిలిటీ 3) న్యూమరికల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్ 4) మిలటరీ ఆప్టిట్యూడ్ టెస్ట్ ల నుండి మొత్తంగా 100 ప్రశ్నలు అడుగుతారు.ఒక్కో ప్రశ్నకు 3 మార్కులు ఉంటుంది.దీనికి నెగిటివ్ మార్కులు కూడా ఉంటాయి.ఈ పరీక్షను Online లో రెండు గంటల సమయం తీసుకుని నిర్వహిస్తారు.

 

AFACB టెస్టింగ్ (రెండవ దశ)

 

మొదటి దశ అయిన Indian Air force నిర్వహించిన పరీక్షలో విజయం సాధించాక AFSB టెస్ట్ ని నిర్హ్వహిస్తారు.

INDIAN AIR FORCE

జీత భత్యాలు

ఈ పరీక్షలో విజయం సాధించాక సంబంధిత విభాగాలలో ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ఉద్యోగం పొందుటకు ప్రారంభంలోనే నెలకు రూ 56,000 ల నుండి రూ1,77,500 వరకు జీతం ఉంటుంది.

 

దరఖాస్తు విధానము

 

Notification: Click Here

Online Apply Link: Click Here

Official Website LinkCLICK HERE

Online Apply Start – 01-06-2023

Apply Last Date: 30-06-2023

Exam Date (AFCAT) : August 25,26,27

Exam Centres : Gunturu,Hyderabad,Rajamandi,Tirupati,Vijayawada,Vishakapatnam,Warangal.

 

Share to Help