“Why AP Needs Jagan” introduction
Why AP Needs Jagan – ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ నాలుగున్నరేళ్ల కాలంలో ప్రజలకు ఇచ్చిన హామీలను 99.5% అమలు చేసినట్టు మరియు DBT, Non-DBT ద్వారా ఇప్పటివరకు 2,40 లక్షల కోట్ల రూపాయలను నేరుగా ప్రజలకే ఆంధిచినట్టు చెబుతున్నారు.కావున వీటికి సంబంధించిన సమాచారాలను ప్రజలకు తెలియాలనే ఉద్దేశ్యం మరియు గత ప్రభుత్వానికి ఇప్పటి ప్రభుత్వానికి గల తేడాని కూడా ప్రజలకు వివరించే ప్రయత్నమే ఈ Why AP Needs Jagan అనే కార్యక్రమం. ఇది ఏక కాలంలో ప్రభుత్వ అధికారులు మరియు పార్టీ నాయకుల ద్వారా ఈకార్యక్రమాన్ని చేయు విధంగా ఆదేశాలు రావడం జరిగింది. కనుక ముఖ్యంగా ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు,కన్వీనర్లు మరియు గృహ సారధులు,పార్టీ అభిమానులు అందరూ పాల్గొంటారు.
కార్యక్రమం – రాష్ట్ర వ్యాప్తంగా నవంబర్ 9 నుండి డిసెంబర్ 19 వరకు జరుగుతుంది. మొదటగా 7,610 గ్రామ సచివాలయ పరిధిలో ఈ ప్రొగ్రామ్ జరుగును.ఆ తరువాత మిగిలిన సచివాలయంలో చెప్పిన తేదీలు లోగా జరుపబడును.
సంక్షేమ పథకాల ప్రదర్శన బోర్డు ఆవిష్కరణ కార్యక్రమం
మొదటగా ఈ నాలుగున్నరేళ్ల కాలంలో ఆ సచివాలయ పరిధిలో వున్న గ్రామాలకు గానే లేదా వార్డులలో గానీ ప్రజలకు సంక్షేమ పథకాల రూపంలో ఎంత డబ్బులు అందిచాము అనే విషయాన్ని మరియు Non-DBT ద్వారా మీ గ్రామానికి ఎంత ఖర్చు చేసామో అని మొత్తం డబ్బులను వివరంగా ప్రజలకు అర్ధం అయ్యే విధంగా బోర్డు లను సచివాలయం బయట ఏర్పాటు చేస్తారు.కనుక ఈ కార్యక్రమానికి M L A, M P మరియు స్థానిక ప్రజా ప్రతినిధులు గృహ సారధులు,పార్టీ అభిమానులు,ప్రజలు అందరూ సాయంత్రం 3-4 గంటలకు పాల్గొని ఈ బోర్డు లను ఆవిష్కరిస్తారు.ఇంతటితో సంక్షేమ పథకాల ప్రదర్శన బోర్డు ఆవిష్కరణ కార్యక్రమమం అధికారులతో పూర్తి అవుతుంది.
ఇక అక్కడ నుండి పార్టీ నాయకులు ఆ గ్రామాలలోని పెద్దలను కలసి మాట్లాడి రాత్రి అక్కడే నిద్రించి, మళ్ళీ ఉదయం లేచి Why AP Needs Jagan అనే కార్యక్రమము ద్వారా ప్రభుత్వం నుండి వచ్చిన 24 పేజీల బుక్లెట్ ని వాలంటీర్స్ ద్వారా ప్రతి ఇంటికి చేర్చుతూ మరియు ఆక్కడే పార్టీ నాయకులు కూడా ప్రజలకు గత ప్రభుత్వానికి,ఈ ప్రభుత్వానికి గల తేడాని వివరిస్తూ, ” ఆపు బాబు నాటకం..జగన్ మా నమ్మకం ” అనే కరపత్రాన్ని చదివి వాళ్ళ దగ్గర నుండి 6 ప్రశ్నలకు మార్కులను వేయించుకుని ఆ తరువాత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే జగన్ పాలన కావాలి అని అడిగి బాక్స్ లో టిక్ ఇస్తారు. అలాగే జగన్ పాలన పై సంతృప్తి చెందినట్లయితే బ్రోచర్ పై స్టాంప్ (ముద్ర) కూడా వేయించుకోవాలి.
Why AP Needs Jagan కి సంబంధించి వాలంటీర్ సర్వే
ఈ కార్యక్రమానికి సంబంధించి వాలంటీర్ చేయవలసిన పనులు
1) మొదటగా సంక్షేమ పథకాల ప్రదర్శన బోర్డు ఆవిష్కరణ అనే కార్యక్రమం జరుగుతుంది కనుక వాలంటీర్స్ ఆ కార్యక్రమానికి 3 రోజులు ముందరే మీ హౌస్ హోల్డ్స్ కి ఈ కార్యక్రమానికి రావాలని ఇంటింటికి వెళ్లి చెప్పాల్సి ఉంటుంది. మరియు SMS రూపంలో కార్యక్రమానికి ముందు రోజు కూడా సమాచారాన్ని చేరవేయాల్సి ఉంటుంది.
2) ఈ సంక్షేమ పథకాల ప్రదర్శన బోర్డు ఆవిష్కరణ కార్యక్రమం తరువాత రోజు నుండి Why AP Needs Jagan అనే కార్యక్రమం మొదలవుతుంది.
3) Why AP Needs Jagan కార్యక్రమానికి సంబంధించి 24 పేజీల బుక్లెట్ ని ప్రజలకు అందిచడానికి ఒక మొబైల్ యాప్ ఇచ్చారు.
4) ఒక్కో వాలంటీర్ ఒక రోజుకి 15 కుటుంబాలకు మాత్రమే ఈ బుక్లెట్ ఇచ్చి ekyc తీసుకోవాల్సి ఉంటుంది.
వాలంటీర్ యాప్ లో E-KYC చేయు విధానము (Why AP Needs Jagan )
దీనికి సంబంధించి Beneficiary Outreach V – 17.2 అనే మొబైల్ ఇచ్చారు
Link – CLICK HERE
Step 1 – పై యాప్ నందు మొదటగా వాలంటీర్ ఆధార్ నెంబర్ తో లాగిన్ అవుతారు.
Step 2 – ఇక్కడ ఈ క్రింది ఫొటోలో చూపించిన విధంగా Why Andhra Pradesh Needs Jagan అనే ఆప్షన్ కనిపిస్తుంది.కనుక దాని మీద క్లిక్ చేసుకోవాలి.
Step 3 – వాలంటీర్ లాగిన్ అయ్యాక క్లస్టర్ సచివాలయ కోడ్, క్లస్టర్ నెంబర్ ఎంచుకుంటే వారికీ సంబంధించిన కుటుంబాల వివరాలు అన్నీవస్తాయి.అక్కడ మీరు ఇంటికి వెళ్ళే కుటుంబాన్నిఎంచుకోవాలి.
Step 4 – ఇక్కడ కుటుంబ పెద్దకి సంబధించిన వివరాలు వస్తాయి మరియు అక్కడే ఆంధ్రప్రదేశ్ కి జగన్ ఎందుకు కావాలంటే..బుక్లెట్ కుటుంబ సభ్యులకు అందించారా? అనే ఆప్షన్ వస్తుంది. అక్కడ yes , No అనే రెండు ఆప్షన్స్ ఉంటాయి.ఆ తరువాత వారి యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి వారి దగ్గర బయోమెట్రిక్ లేదా ఐరిష్,పేస్ ekyc ఏదో ఒకటి అయితే తీసుకోవాల్సి ఉంటుంది.
Step 5 – ఆ తరువాత వాలంటీర్ కూడా ఖచ్చితంగా బయోమెట్రిక్, ఐరిష్, లేదా పేస్ ఏకీక ఏదో ఒకటి చేయాల్సి ఉంటుంది.ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే వాలంటీర్ రోజుకి 15 ఇళ్లకు మాత్రమే వెళ్లి ekyc చేస్తూ వారం నుండి 10 రోజులు ఈ కార్యక్రమం చేయు లాగా చూసుకోవాలి.
Why AP Needs Jagan Report Status
Link – Click Here
Why AP Needs Jagan – Booklet
PDF – Click Here
Related Links
ఆధార్ కార్డు తో రైస్ కార్డు నెంబర్ కనుకునే విధానం
క్రొత్త ఓటరు కార్డు వెబ్సైటు మరియు సర్వీసుల లిస్ట్