Introduction
Important 4 Updates – ఈ పేజీనందు మనం ఇప్పుడు 09-08-2023 నాటికీ వచ్చిన ప్రధాన అప్డేట్స్ గురించి అయితే చాల వివరంగా చెప్పుకుందాం.అందులో వైస్సార్ కల్యాణ మస్తు / షాదీ తోఫా మరియు కాపు నేస్తం కి సంబంధించిన అర్హుల జాబీతా మరియు వైస్సార్ పెన్షన్స్ కి సంబంధించి ముఖ్య అప్డేట్ అలాగే అమ్మఒడి కి సంబంధించిన అప్డేట్స్..ఇలా చాలా విషయాలు చెప్పుకుందాం.
1 (A) వైస్సార్ కల్యాణ మస్తు / షాదీ తోఫా (Important 4 Updates)
ఈ వైస్సార్ కల్యాణ మస్తు / షాదీ తోఫా కి సంబంధించి ఈ రోజు అంటే ఆగస్టు 9,2023 వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ ఆర్ధిక సాయాన్ని CM క్యాంపు ఆఫీస్ నుండి బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల అకౌంట్ లలోకి జమ చేసారు.
ఈ విడతలో చేసిన మార్పులు,ముఖ్యాంశాలు
1) ఏప్రిల్ నుండి జూన్ మధ్యలో వివాహం జరుపుకున్న 18,883 మంది జంటలకు రూ 141.60 కోట్లను విడుదల చేసారు.
2) గత నెలలో వచ్చిన అప్డేట్ నుండి ఇక నుండి వివాహం జరిగిన 30 రోజుల లోపు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.(ఇంతక ముందు 60 రోజులు ఉండేది)
3) ఈ విడత నుండి డబ్బులు జమ అనేది పెళ్లి కూతురు యొక్క తల్లి ఖాతాలో వేస్తామంటున్నారు.మరియు ప్రేమ వివాహాలకు మాత్రం పెళ్లి కూతురు యొక్క ఖాతాలోనే వేయటం జరుగుతుంది.
4) ఈ విడత నుండి వైస్సార్ షాదీ తోఫాలో మైనార్టీలకు ఇచ్చే 50 వేల ఆర్ధిక సాయాన్ని 1 లక్ష వరకు పెంచడం జరిగింది.
వైస్సార్ కల్యాణ మస్తు & షాదీ తోఫాకి సంబందించి పూర్తి వీడియో
1 (B) వైస్సార్ కల్యాణ మస్తు / షాదీ తోఫా పేమెంట్ స్టేటస్ చెకింగ్
దీనికి సంబధించిన వివరాలు ఈ క్రింది ఇచ్చిన లింక్ ద్వారా చెక్ చేసుకోగలరు.
LINK – CLICK HERE
Step 1– పై లింక్ పై క్లిక్ చేసుకున్నాక అక్కడ మొదట Scheme దగ్గర వైస్సార్ కళ్యాణమస్తు / షాదీతోఫా అని సేసలెక్టు చేసుకోండి
Step 2– ఇక్కడ ఈ ఆర్ధిక సంవత్సరం అయిన 2023-24 అని సెలెక్ట్ చేసుకోండి
Step 3– ఇక్కడ మీ ఆధార్ నెంబర్ ని ఎంచుకోవాలి
Step 4– ఇక్కడ తప్పులు లేకుండా CAPTCHA ఎంటర్ చేసి Send OTP పైన క్లిక్ చేయాలి.
Step 5– OTP ఎంటర్ చేసాక సబ్మిట్ చేసినట్టళైయితే చివరన Payment Status దగ్గర ఏ అకౌంట్ కి డబ్బులు పడిందో చేసుకోగలరు.లేదా ఒకవేల డబ్బులు పడకపోయుంటే ఎందువల్ల పడలేదో కారణాన్ని కూడా అక్కడే చూపిస్తుంది.
2) 09-08-2023 నాడు వచ్చిన కాపు నేస్తం అప్డేట్ (Important 4 Updates)
ఈ రోజు వచ్చినకాపు నేస్తం అప్డేట్ ఏమిటంటే సచివాలయం నందు అర్హుల జాబితా మరియు అనర్హుల జాబితా విడుదల అయింది.కనుక కాపు నేస్తం అభ్యర్థులు మీ వాలంటీర్ ద్వారా మీ వివరాలను అడిగి తెలుసుకోండి.లేదంటే సచివాలయం కి వెళ్లి NOTICE BOARD లో జాబితా ని పెట్టి వుంటారు.కనుక అక్కడ కూడా చెక్ చేసుకోవచ్చును.
అనర్హుల జాబితాలో పేరు వచ్చివుంటే ఏమి చేయాలి?
ఈ రోజు వచ్చిన లిస్ట్ తాత్కాలిక లిస్ట్.కనుక అందులో మీకు అర్హత వుండి కూడా ఈ పతకంలో అర్హుల జాబితాలో పేరు రాకుంటే మీ సచివాలయం లోఇప్పుడు తగిన ఆధారాలతో వెరిఫికేషన్ కి పెట్టుకోవచ్చు,ఆలా మీరు పెట్టుకునే అమౌంట్ విడుదల చేసే ముందర వచ్చే ఫైనల్ అర్హుల జాబితాలో పేర్లు వస్తాయి.
సమస్య ని తీసుకోకపోతే ఎవరికీ చెప్పుకోవాలి ?
ప్రభుత్వం ప్రతి పథకానికి సంబంధించి మీకు ఏ సందేహాలు వున్ననూ లేదా సమస్యలు వున్ననూ 1902 అనే నెంబర్ కి కాల్ చేసి చెప్పుకోవచ్చు అను ముఖ్యంమత్రి గారు పదే పదే చెబూతూ వుంటారు.కనుక ఆ అవకాశాన్ని కూడా ఉపయోగించుకోగలరు.
3) YSR పెన్షన్స్ కి సంబంధించి ముఖ్య అప్డేట్ (Important 4 Updates)
ఈ ysr పెన్షన్ కానుక కి సంబంధించి చాల ముఖ్యమైన అప్డేట్ అని చెప్పుకోవచ్చును.ఎందుకంటే గతంలో ఎవరికైనా వివిధ కారణాల వలన పెన్షన్ 3 నెలల ముందు ఆగిపోయి వుంటే ఇప్పుడు అలాంటి వారికీ మరలా పెన్షన్ ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది.దీనికి సంబంధించి సచివాలయం లోని వెల్ఫేర్ సెక్రెటరీ యొక్క లోగిన్ నందు Roll Back అనే ఆప్షన్ ఇవ్వడం జరిగింది.కనుక వాలంటీర్స్ అలంటి వారిని గుర్తించి మీ వెల్ఫేర్ సెక్రెటరీ కి తెలియజేస్తే Roll BAck ద్వారా మల్లె పెడుతారు.వాళ్లకి Bi-Annual లో విడుదల చేసాము అని అంటున్నారు.
4) అమ్మ ఒడికి సంబంధిచిన అప్డేట్ (Important 4 Updates)
ఈ రోజున అంటే 09-08-2023 వ తేదీన అమ్మఒడికి సంబంధించిన క్రొత్త అప్డేట్ ఏమిటంటే సచివాలయం లోని డిజిటల్ అసిస్టెంట్ వాళ్లకి అమ్మఒడి MIS Report అనే ఆప్షన్ ఇవ్వడం జరిగిది. దీని ద్వారా ఎవరి ఖాతాలో డబ్బులు పడ్డాయో చూపిస్తూ వుంది.
.
5) మీకు ఖచ్చితంగా ఉపయోగపడే మరిన్ని సమాచారాలు
- 10 వతరగతి తో పోస్టల్ ఉద్యోగాలు నోటిఫికేషన్ – Open
2. మీ ఓటరు కార్డు కి సంబంధించి ఎలాంటి సర్వీసు కైననూ ఉచితంగా చేసే వ్యక్తి యొక్క వివరాలు – Click Here
3. మీ ఆధార్ కి ఏ మొబైల్ నెంబర్ లింక్ అయిందో తెలుసుకోవడం – Click Here