Essential Aadhar Document Updation FAQ: Your Top Questions Answered

3.5/5 - (4 votes)

Introduction

ఈ పేజీ నందు Aadhar Document Updation గురించి చాలా వివరంగా విశ్లేషణ చేసుకుంటూ మరియు ప్రజలకు దీనిమీద వున్న సందేహాలు అన్నింటిని వివరంగా అర్ధమయ్యేలా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం.కావున ఈ  Aadhar Document Updation గురించి వీడియోల రూపంలో మన You tube ఛానల్ అయిన Maddimadugu Munirathnam అనే ఛానల్ నందు వివరంగా చెప్పి వున్నాను. కనుక మీకు వీడియోల రూపంలో కావాలంటే ఆ వీడియోస్ ని ఉపయోగించుకోవచ్చును.

ఈ  Aadhar Document Updation  పై ప్రజలకు వున్నా సందేహాలు

1)  Aadhar Document Updation అంటే ఏమిటి

ఈ  Aadhar Document Updation  అంటే 2016 వ సంవత్సరానికి ముందు ఆధార్ కార్డులు తీసుకుని ఆ తర్వాత నుండి ఎప్పుడూ ఒక్కసారి కూడా వ్యక్తిగత వివరాలు (POI) మరియు చిరునామా కి సంబంధిచిన వివరాలు (POA) ను మార్చుకోకుండా ఉన్నట్లయితే అట్టి వాళ్ళు మాత్రం ఈ Aadhar Document Updation చేసుకోవాలి.ఇంకో విధంగా చెప్పుకోవాలంటే ఆధార్ తీసికుని 10 సంవత్సరాలు అయ్యి ఈ మధ్యలో ఏ వివరాలు మార్చుకోకుండా ఉంటే అట్టి వారు మాత్రమే Aadhar Document Updation  చేసుకోవాలి..

 

2) ఈ Aadhar Document Updation సర్వీసు కి ఎంత ఛార్జ్ చేస్తారు ?

 Aadhar Document Updation చేసుకోవాంటే దగ్గర్లోని ఆధార్ సెంటర్ కి వెళ్లి చేసుకుంటే రూ 50/-లు తీసుకుంటారు.అదే మనమే మన ఫోన్ లోనో లేదా కంప్యూటర్ లోనో చేసుకుంటే పూర్తిగా ఉచితం. ఈ Aadhar Document Updation ఉచితంగా చేసుకోవడానికి Sep 14,2023 వరకు వుంది.దీనికి సంబంధించి ఉచితంగా మనమే చేసుకోవడానికి ఈ లింక్ పై క్లిక్ చేసుకోండి. Click Here 

3) ఈ Aadhar Document Updation వలన లాభాలు ఏమిటి ?

Aadhar Document Updation చేసుకోవడం వలన మనము 2016 కి ముందు ఆధార్ క్రొత్తది తీసుకున్నపుడు వ్యక్తిగత సమాచారం (POI) మరియు చిరునామాకు సంబంచిన (POA) ప్రూఫ్స్ ఎమి ఇవ్వకుండానే ఆధార్ తీసుకుని వుంటాము.కనుక ఈ ఆధార్ కార్డు ని ప్రస్తుత సమాజంలో అన్ని ఆర్ధిక లావాదేవీలకు మరియు ప్రభుత్వ పరమైన సేవలు పొందుటకు ఇలా చాల రకాలుగా వాడుతున్నాము.కనుక Aadhar ని పటిష్టం చేసి మీ సమాచారం  మొత్తన్ని భద్రంగా ఉంచడానికి ఈ Aadhar Document Updation అనేది చేస్తున్నారు.

 

4) ఈ Aadhar Document Updation చేసుకోవాలని ఫోన్లకు massage లు వస్తున్నాయి..అదినిజమా/అబద్దమా ?

అవును నిజమే

5) 2016 వ సంవత్సరం పైన ఆధార్ లు తీసుకున్నాము మేము కూడా చేసుకోవాలా?

అవసరం లేదు,ఎందుకంటే ఆ తరువాత నుండి ఆధార్ లు తీసుకున్నవారికీ ప్రూఫ్స్ తీసుకుని ఆ తరువాత మాత్రమే క్రొత్త ఆధార్ కార్డు లు ఇస్తారు.కావున ఆప్పుడు అలాంటివారు POI-POA లు ఇచ్చి వుంటారు.

6) అసలు POI – POA  అంటే ఏమిటి?

POI  అంటే Proof Of Identity

POA  అంటే Proof Of Address

పై వాటికి సంబంధించిన PDF లిస్ట్ (4,5,6 Pages ) CLICK HERE

Essential Aadhar Document Updation FAQ: Your Top Questions Answered

 

7) ఆధార్ అప్డేట్ కి ఆధార్ డాక్యుమెంట్ కిమధ్య వ్యతాసం ఏమిటి ?

ఈ విషయం లో చాల మంది కూడా గందరగోళానికి గురవుతున్నారు.ఇక్కడ గమనించలసిన విషయం ఏమిటంటే

 ఆధార్ అప్డేట్ అంటే మన ఆధార్ కార్డు లోని వివరాలలో అంటే పేరు,తండ్రి పేరు,పుట్టిన తేదీ,లింగం,చిరునామా,మొబైల్ నెంబర్,ఈ మెయిల్,బయోమెట్రిక్ ఈ విధముగా ఇప్పటికే వున్నా వివరాలలో ఏదైనా తప్పులు వుండి  మార్చుకుంటే దానిని ఆధార్ అప్డేట్ అంటారు.కావున ఇది చేసుకున్నాక  క్రొత్త వివరాలతో క్రొత్త ఆధార్ గ తయారవుతుంది.దీనిని కుడా Self గా మనమే చేసుకోవచ్చును. Click Here 

Aadhar Document Updation అంటే 2016 సవత్సరానికి ముందు తీసుకున్న ఆధార్ కార్డు లోని వివరాలు నావే అని ఇప్పుడు వాటికీ సంబంధించిన ప్రూఫ్స్ ఏమైనా ఇవ్వాలి. దానినే  Aadhar Document Updation అంటారు.ఇది చేసుకుంటే ఇప్పుడు వున్న ఆధార్ లో వివరాలు ఏమి మారవు.కనుక మరో ప్రింట్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు.

 

8) గతంలో మేము మొబైల్ నెంబర్,బయోమెట్రిక్ అప్డేట్ చేసుకున్నాము..అది సరిపోతుందా..?

     లేదు, ఎంధుకంటే  పేరు, ఇంటిపేరు,తండ్రి పేరు,పుట్టిన తేదీ, చిరునామా కి సంబంధించి ఏమైనా మార్చుకునేటప్పుడు దానికి సంబంధించిన ప్రూఫ్స్ వున్నా ఇచ్చ్హి మార్చుకుని వుంటారు. లేదా  ఆధార్ లోని వివరాలు మార్చుకునేటప్పుడు గెజిటెడ్ ఆఫీసర్ దగ్గర సంతకం చేసి తీసుకెళ్లిన ప్రూఫ్స్ పెట్టి మర్చుంటారో వారికీ మాత్రమే ఈ Aadhar Document Updation అవసరం లేదు.మీరు మొబైల్ నెంబర్,బయోమెట్రిక్ అప్డేట్ చేసుకులేటప్పుడు కేవలం మీ వేలి ముద్రలు మాత్రమే పెట్టి మార్చుకుంటారు కానీ ఎలాంటి ప్రూఫ్స్ అనేది ఇవ్వరు.కనుక అలంటి వాళ్ళు మాత్రం మళ్ళీ తప్పకుండా ఈ Aadhar Document Updation చేసుకోవాలి.

 

9) ఇప్పుడు సులభంగా Aadhar Document Updation చేసుకోవాలంటే ఏమి చేయాలి ?

Aadhar Document Updation చేసుకోవడానికి రెండు Proofs అయితే ఇవ్వాలనే విషయాన్ని తెలుసుకున్నము. ఒకటి Proof of identity రెండు Proof of address. మీ ఆధార్ కార్డు లో వివరాలకు మ్యాచ్ అయ్యేటట్టు ప్రూఫ్స్ ఉంటే వాటినే Upload  చేసి Aadhar Document Updation చేసుకోండి.లేదంటే ఇంకా సులభంగా ఆధార్ అడ్రెస్ సర్టిఫికేషన్ అనే అప్లికిషన్ ని ప్రింట్ తీసుకుని మీ ఆధార్ లో ఉన్నట్లు వివరాలు వ్రాసుకుని ఎవరిదగ్గరైన గెజిటెడ్ ఆఫీసర్ దగ్గర సంతకం చేయించుకుని దానిని తీసుకెళ్లి సులభంగా Aadhar Document Updation చేసుకోవచ్చు.

       ఆంధ్రప్రదేశ్ ప్రజలు అయితే  ప్రభుత్వం చాలా సులభంగా మీ సచివాలయంలోనే VRO ద్వారా ఈ ఆధార్ సర్టిఫికేషన్ అనేది ఇప్పిస్తున్నారు.దానికి కేవలం రూ 20/-లు ఛార్జ్ చేస్తున్నారు.దీనిని ఎలా తెచ్చుకోవాలని వీడియో చేసి వున్నాను,దానిని ఈ పేజీ చివరన ఇస్తాను ఉపయోగించుకోగలరు.

10) సచివాలయం రూ20/-లకు తీసుకున్న ఆధార్ అడ్రెస్స్ సర్టిఫికేషన్ ని ఏ ఆప్షన్ ద్వారా అప్లోడ్ చేయాలి?

ఈ క్రింది ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోగలరు.ఇక్కడ పైన ఆప్షన్ ఈ విధంగా చూపిస్తుంది కానీ ఆ ఆప్షన్ సెలక్షన్ అక్కడ చివర్లో VRO  అనే ఆప్షన్ కూడా వస్తుంది.

Standard Certificate by Village Panchayat Head/President or Mukhiya/Village Panchayat Secretary అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి.

Essential Aadhar Document Updation FAQ: Your Top Questions Answered

 

అదార్ డాక్యుమెంట్ అప్డేట్ మనమే చేసుకునే డెమో వీడియో

 

Related Links 

 

క్రొత్త ఓటరు కార్డు వెబ్సైటు లో ప్రజలకు ప్రయోజనాలు 

పాన్ కార్డు కి ఆధార్ లింక్ చేయు విధానము 

ఆధార్ కార్డు లో అడ్రెస్స్ మార్చుకునే విధానము 

ఆధార్ హిస్టరీ ని PDF లో డౌన్లోడ్ చేయు విధానము 

PVC  ఆధార్ కార్డు కొరకు బోక్ చేయు విధానము 

Share to Help