Introduction
Jagananna Suraksha Programme: ఈ Jagananna Suraksha Programme అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము లో 2023 జూన్ 23వ తేదీన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినారు. ఈ Jagananna Suraksha Programme యొక్క ఉద్దేశ్యం ముఖ్యంగా ఏమిటంటే ప్రభుత్వం ఇస్తున్నటువంటి వివిధ రకాల సంక్షేమ పథకాలలో అర్హత వుండి కూడా లబ్ది పొందలేక ఎవరైనా మిగిలిపోయారా అని వాలంటీర్లు,సచివాలయ సిబ్బంది,గృహ సారధులు ప్రతి ఇల్లు తిరిగి సమస్యలను కనుగొని వాటిని సచివాలయం లో జరిగే క్యాంపు రోజు మండలంలోని మండల స్థాయి అధికారులు వచ్చినప్పుడు వారి ద్వారా ఈ సమస్యలను తీర్చడానికి ఈ Jagananna Suraksha Programme అనే దాన్ని జరపనున్నారు.కావున ఈ పేజీ నందు ఈ Jagananna Suraksha Programme నందు మీ గ్రామంలోని సచివాలయం నందు క్యాంపు ఏ రోజున పెడుతారో అని మీరే మీ ఆధార్ నెంబర్ ద్వారా సులభంగా కనుకునే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. దీనితో పాటు ఎప్పటికప్పుడు వాలంటీర్స్ చేసే ఈ సర్వేని చూసుకునే విధంగా Dash Board కూడా ఇచ్చారు.దీని ద్వారా ఇంకా ఎన్ని కుటుంబాలు చేయాల్సివుంది అనే విషయాన్నీ మనమే చెక్ చేసుకునే అవకాశం కూడా వుంది కనుక అది ఎలానో కూడా తెలుసుకుందాం.
కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాలకి సంబంధించిన వివిధర రకాలైన సంక్షేమ పథకాలు మరియు జాబ్ అప్డేట్స్ గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని ఆసక్తి వున్న వారు ఈ క్రింది వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయి నూతన అప్డేట్స్ తెలుసుకుంటూ మరియు అందులో మీకు ఏమైనా సందేహాలు వున్నచో ఈ వాట్సాప్ ద్వారా నన్ను డైరెక్ట్ గా అడిగి,నివృత్తి చేసుకోవచ్చును.
సందేహాలు – సమాధానాలు
1) ఈ Jagananna Suraksha Programme లో Mobile APP నందు వివరాలు ఓపెన్ కాలేదు కారణం ఏమిటి ?
జ) ఈ Jagananna Suraksha Programme అనే కార్యక్రమం కోసం వాలంటీర్స్ కి ఈ క్రింది మొబైల్ యాప్ ఇచ్చింది.
ఈ మొబైల్ యాప్ నందు Jagananna Suraksha Programme కోసం ఇచ్చిన సర్వే లో కుటుంబ వివరాలు ఇంకా ఓపెన్ కాలేదని వాలంటీర్స్ సందేహాలను అడుగుతున్నారు దీనికి ప్రభుత్వం నుండి అధికారికంగా వచ్చిన సమాచారం ఏమిటంటే మీ సచివాలయ పరిధిలో క్యాంపు ఏ తేదీన నిర్వహిస్తారో ఆ తేదీకి 7 రోజుల ముందు మాత్రమే వాలంటీర్ యాప్ లో సర్వే కి ఓపెన్ అవుతాయి.
2) మీ గ్రామంలో Jagananna Suraksha Programme క్యాంపు ఎప్పుడు పెడుతారో,మీ ఆధార్ తో తెలుసుకోవడం ఎలా ?
జ) మీ గ్రామంలో Jagananna Suraksha Programme అనేది ఏ తేదీన నిర్వహిస్తారో అని మనమే మన ఆధార్ తో తెలుసుకునే వేసులుబాటు కల్పించినది.కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోగలరు.దీనికి సంబంధించిన లింక్ ఈ క్రింద ఇవ్వబడుతుంది.
Step 1: పై లింక్ ఓపెన్ చేసాక మొదటి పేజీ ఈ క్రింది విధంగా కనిపిస్తుంది.
Step 2: ఈ పేజీ నందు పైన మార్క్ చేసిన దగ్గర Know your Jagananna Suraksha Camp Date అనే ఆప్షన్ పై క్లిక్ చేశాక ఈ క్రింది రకమైన పేజీ ఓపెన్ అవుతుంది.
Step 3: ఇక్కడ మీ ఆధార్ నెంబర్ ద్వారానైనా తెలుసుకోవచ్చును.ఒకవేళ మీ ఆధార్ నెంబర్ సమయానికి లేకపోయినా కూడా మీ జిల్లా మరియు మీ మండలం లేదా మున్సిపాలిటీ ని ఎంచుకుని తరువాత మీ సచివాలయం పేరు ని సెలెక్ట్ చేసుకున్నాక Check Status అనే ఆప్షన్ పై క్లిక్ చేయగా ఈ క్రింది రకమైన వివరాలు చూపిస్తాయి.ఇక్కడమీసచివాలయం పేరు మరియు ఏ తేదీన ఈ Jagananna Suraksha Camp జరగనున్నదో చూపిస్తుంది.కనుక ప్రజలు ఈ అవకాశాన్ని ప్రజలు ఉపయోగించుకోవలెను.
Jagananna Suraksha Survey Dash Board link
DASH BOARD
Related Links
జగనన్న సురక్ష అంటే ఏమిటి ? పూర్తి వివరాలు ?
న్యూ ఓటరు కార్డు వెబ్సైటు లో వున్న క్రొత్ ఆప్షన్స్ ఏమిటి?