Introduction
Ysr Kapu Nestham & Ysr Vahana Mithra: ఈ Ysr Kapu Nestham & Ysr Vahana Mithra ఈ 2023 సంవత్సరం కి సంబంధించి నూతన వివరాలను ఇవ్వడం జరిగింది.కనుక అన్ని విషయాలను ఈ పేజీ లో తెలుసుకుందాం.
ఈ సంవత్సరం వచ్చిన నూతన వివరాలు ఏమిటి ?
ఈ Ysr Kapu Nestham & Ysr Vahana Mitra కి సంబంధించి క్రొత్తగా దరఖాస్తు చేసుకోదలచిన వారు ఇప్పుడు సచివాలయం వెళ్లి చేసుకోవచ్చును,
గతంలో వచ్చిన వారు కూడా ఈ పథకాలకు వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చా ?
ప్రస్తుతానికి అంటే జులై 15 వ తేదీ నాటికి క్రొత్తగా దరఖాస్తు కి మాత్రమే అవకాశం ఇచ్చారు. ఇంకా రెన్యూవల్ కి సంబంధించి ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు.దీనికి సంబంధించి ఏదైనా అప్డేట్ వస్తే ఈ వెబ్సైటు ద్వారా లేదా మన యూట్యూబ్ ఛానల్ లో తెలియజేస్తాను.
డబ్బులు ఎప్పుడు వేయనున్నారు?
Ysr Kapu Nestham & Ysr Vahana Mitra కి సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన సంక్షేమ క్యాలెండర్ ప్రకారం ఆగష్టు నెలలో ఉంటుంది.కావున ఈ రెండు పథకాలకి సంబంధించి ఈ రోజు నాటికీ అయితే కరెక్ట్ డేట్ ని ఇంకా చెప్పలేదు.కానీ ఆగష్టు లోనే డబులు రిలీజు చేయనున్నారు.
Ysr Kapu Nestham అంటే ఏమిటి?
Ysr Kapu Nestham: YSR కాపు నేస్తం అంటే కాపు,ఒంటరి,బలిజ,తెలగ కులాలకు సంభందించిన మహిళలకు వయస్సు 45 సంవత్సరాలు నుండి 60 లోపల వున్న వారికి సంవత్సరానికి రూ 15,000 లను ఉచితంగా ఇస్తారు.
ఈ Ysr Kapu Nestham కావాల్సిన డాకుమెంట్స్ ఏమిటి ?
ముందుగా ప్రతి ఒక్కరూ ఈ YSR Kapu Nestham కి అర్హులా,కాదా అనే విషయాన్నీ ఈ క్రింది లింక్ ద్వారా చెక్ చేసుకోగలరు. అక్కడ మీకు అన్నీ satisfied అని వస్తే నిరభ్యంతరంగా వెళ్లి సచివాలయం లో దరఖాస్తు చేసుకోగలరు.
Scheme Eligibility చెక్ చేసుకునే విధానము
కావాలసిన డాకుమెంట్స్
- అప్లికేషన్ ఫారం
- ఆధార్ కార్డు (భార్య / భర్త)
- రైస్ కార్డు
- క్యాస్ట్ సర్టిఫికెట్ (AP SEVA )
- ఇన్కమ్ సర్టిఫికెట్ (AP SEVA )
- బ్యాంక్ అకౌంట్
- ఆధార్ హిస్టరీ
Ysr Kapu Nestham & Ysr Vahana Mithra కి చివరి తేదీ ఎప్పుడు?
ఈ Ysr Kapu Nestham & Ysr Vahana Mithra రెండూ పథకాలకు క్రొత్తగా దరఖాస్తు చేయడానికి ప్రస్తుతం జూలై 20 వరకు అవకాశం ఇచ్చారు.బహుశా పెంచచ్చు ,,పెంచకపోవచ్చు.ఏదైనా ప్రభుత్వం నుండి అప్డేట్ వస్తే ఇందులోనే తెలియజేస్తాను.
ఈ Ysr Vahana Mithra అంటే ఏమిటి?
ఈ YSR Vahana Mithra అంటే స్వంతంగా ఆటో,టాక్సీ ,మ్యాక్సీ,క్యాబ్ కలిగి వాళ్ళే డ్రైవర్/ఓనర్ గా వున్న వారికి సంవత్సరానికి రూ 10,000 లను ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది.ఈ సంవత్సరం నుండి రేషన్ వాహన డ్రైవర్లకు (MDU) కూడా ఈ YSR వాహన మిత్ర వర్తిస్తుంది.
కావాలసిన డాకుమెంట్స్
- అప్లికేషన్ ఫారం
- ఆధార్ కార్డు
- రైస్ కార్డు
- క్యాస్ట్ సర్టిఫికెట్ (AP SEVA )
- ఇన్కమ్ సర్టిఫికెట్ (AP SEVA )
- బ్యాంక్ అకౌంట్
- ఆధార్ కి లింక్ అయిన మొబైల్ నెంబర్
- RC బుక్ జెరాక్స్
- డ్రైవింగ్ లైసెన్స్
Related Links
మీ ఫోన్లోనే ఆరోగ్య శ్రీ కార్డు ని ఉచితంగా డౌన్లోడ్ చేసుకునే విధానము.
మీ సచివాలయం లో జగనన్న సురక్ష క్యాంప్ ఎప్పుడో తెలుసుకోండి
మీ పాన్ కార్డు పని చేస్తుందా లేదా చెక్ చేసుకోండి