Introduction
Cabinate Decisions – ఈ పేజీ నందు ఫిబ్రవరి 4 వతేదీన తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన Cabinate సమావేశం జరిగినది.అందులో 6 గ్యారంటీలలో ఇంకా అమలు అవనున్న సంక్షేమ పథకాలకు సంబంధించి Cabinate లో ఆమోదం చేసుకున్నారు.కనుక ఈ అంశాలు మొత్తాన్ని కూడా వివరంగా చెప్పుకుందాం.ఇలాంటి లేటెస్ట్ సమాచారాలు మీకు కూడా ఎల్లప్పుడూ తెలుసుకుంటూ ఉండాలంటే ఈ క్రింది వాట్సాప్ నందు జాయిన్ అయి పొందుతూ వుండవచ్చును.
Join Whats app Group
తెలంగాణ Cabinate లో తీసుకున్న నిర్ణయాలు
- తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు తెలంగాణ తల్లి,రాష్ట్ర చిహ్నంలో మార్పులు చేయుటకు Cabinate ఆమోదం లబించింది.
- పేదలకు రూ 500 లకే గ్యాస్ సిలిండర్ల పంపిణీకి క్యాబినెట్లో ఆమోదం లభించింది.(ఈ పతకం అమలు తేదీని ఫిబ్రవరి 8 వతేదీ నుండి జరగబోవు బడ్జెట్ సమావేశాలలో నిర్ణయిస్తారు)
- గ్యారంటీలలో మరో పథకం పేదలకు 200 యూనిట్స్ కరెంట్ ఉచితం పథకానికి కూడా రాష్ట్ర Cabinate లో ఆమోదం లభించింది.(ఇది కూడా అమలు తేదీని బడ్జెట్ సమావేశాలలో నిర్ణయిస్తారు)
- తెలంగాణ రాష్ట్రంలో వాహనాల రిజిస్ట్రేషన్స్ ఇప్పటివరకు TS తో చేస్తున్న వాటిని ఇక మీదట TG తో వాహనాలు రిజిస్ట్రేషన్స్ చేయబడతాయని తెలియజేసారు.
- తెలంగాణ రాష్ట్రంలో కుల గణన చేయించాలని మంత్రి వర్గంలో ఆమోదం లభించింది.
- వ్యవసాయ శాఖలో AEO ల పోస్టుల భర్తీ మరియు హైకోర్టు నిర్మాణానికి 100 ఎకరాల కేటాయింపు.
- గ్రూప్-2, గ్రూప్-3 పోస్టులు మరియు మెగా DSC నిర్వహణపైన క్యాబినెట్ నందు చర్చలు జరిగాయి.అదే విధంగా గ్రూప్-1 పోస్టులకి సంబంధించి గతంలో ఇచ్చిన దానికి మరో 160 పోస్టులును జోడించి రీ నోటిఫికేషన్ ఇవ్వాలని కూడా చర్చ జరిగినది.
- ప్రముఖ కవి అందె శ్రీ రచించిన ‘జయజయహే తెలంగాణ‘ ను రాష్ట్ర అధికారిక గీతంగా ఎంపిక చేయడానికి మంత్రి వర్గం ఆమోదం లభించింది.
- తెలంగాణ తల్లి విగ్రహ రూపం మరియు రాష్ట్ర చిహ్నంలో స్వల్ప మార్పలు చేయాలని కూడా నిర్ణయించారు.
- 65 ప్రభుత్వ ITI కాలేజీలను Advanced Technology Center గా upgrade చేయడానికి ఆమోదం.
Related Links
why AP Needs Jagan Programme Details
ఆధార్ కార్డుతో రైస్ కార్డు నెంబర్ ని కనుక్కోవడం ఎలా?