ISRO లో జాబ్స్ (Introduction)
B.Tech,BE కోర్సులు లేదా దానికి సమాంతర విద్యార్హత ఏదైనననూ పూర్తిచేసుకుని వున్నా,లేదా చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు మంచి Salary Package లతో జీవితంలో స్థిరపడాలనుకున్న యువత సైంటిస్టులగానూ మరియు భారత ఆంతరిక్ష పరిశోధన సంస్థలో ఇంజనీర్ హోదాలో కొలువుదీరే అవకాశం వచ్చింది.కనుక ఈ పేజీ నందు ISRO ప్రకటించిన Notification-2023 గురించి వివరంగా దరఖాస్తు చేయు విధానం మరియు ఖాళీల వివరాల గురించి విశ్లేషించుకుందాం.కనుక ఈ పేజీ లోని వివరాలను క్షుణ్ణంగా పరిశీలించవల్సిందిగా కోరుతున్నాము. ఈ Notification ద్వారా నియామకం చేపట్టిన వారిని ISRO లో సైంటిస్ట్ గా మరియు,ఇంజినీర్స్ గానూ ఖరారు చేస్తారు.గత సంవత్సరం వరకు ఈ పోస్టులకు GATE స్కోర్ ఆధారంగా నియామకం జరిగేది.కానీ ఈ ఏడాది తొలిసారిగా సెంట్రలైజడ్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా ISRO స్వంతంగా ఈ నియామక ప్రక్రియ చేపట్టబోతుంది.
మొత్తం పోస్టుల సంఖ్య / రకాలు
మొత్తం ఉద్యోగాల సంఖ్య – 303 ( 5 విభాగాలకు సంబంధించి)
- సైంటిస్ట్ /ఇంజినీర్ (SC Electronics) – 90 ఉద్యోగాలు
- సైంటిస్ట్ /ఇంజినీర్ (SC Mechanical) -163 ఉద్యోగాలు
- సైంటిస్ట్ /ఇంజినీర్ (SC Computer science) – 47 ఉద్యోగాలు
- PRL లో సైంటిస్ట్ /ఇంజినీర్ (SC Electronics) – 02 ఉద్యోగాలు
- PRL లో సైంటిస్ట్ /ఇంజినీర్ (SC Computer science) – 01 ఉద్యోగాలు
విద్యార్హతలు ఎలా ఏమిటంటే..?
1.సైంటిస్ట్ /ఇంజినీర్ (SC NC Electronics) – ఈ ఉద్యోగం పొందాలి అనుకున్నవారుఅభ్యర్థులు ఇంజినీరింగ్ EC బ్రాంచ్ లో కనీసం 6.84 GPA తో పాటు B,tech ఉతీర్ణత అయివుండాలి.
2.సైంటిస్ట్ /ఇంజినీర్ (SC Mechanical) – ఈ ఉద్యోగం పొందాలి అనుకున్నవారుఅభ్యర్థులు ఇంజినీరింగ్ మెకానిక్ లో కనీసం 6.84 GPA తో పాటు B,tech నందు 65% మార్కులతో ఉతీర్ణత అయివుండాలి.
3. సైంటిస్ట్ /ఇంజినీర్ (SC Computer science) -ఈ ఉద్యోగం పొందాలి అనుకున్నవారుఅభ్యర్థులు ఇంజినీరింగ్ CSE బ్రాంచ్ లో కనీసం 6.84 GPA తో పాటు B,tech నందు 65 శాతం మార్కులతో ఉతీర్ణత అయివుండాలి.
4. PRL లో సైంటిస్ట్ /ఇంజినీర్ (SC Electronics) – ఈ ఉద్యోగం పొందాలి అనుకున్నవారుఅభ్యర్థులు ఇంజినీరింగ్ ECE బ్రాంచ్ లో కనీసం 6.84 GPA తో పాటు B,tech నందు 65 శాతం మార్కులతో ఉతీర్ణత అయివుండాలి.
5. PRL లో సైంటిస్ట్ /ఇంజినీర్ (SC Computer science) – ఈ ఉద్యోగం పొందాలి అనుకున్నవారు అభ్యర్థులు ఇంజినీరింగ్ CSE బ్రాంచ్ లో కనీసం 6.84 GPA తో పాటు B,tech నందు 65 శాతం మార్కులతో ఉతీర్ణత అయివుండాలి.
గమనిక: ఈ విద్యా సంవత్సరం లో చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చును. కానీ వాళ్ళు ఈ ఆగష్టు 31,2023 నాటికల్ల సర్టిఫికెట్లు పొందాల్సివుంటుంది.
జీత భత్యాలు
ఈ సైంటిస్ట్ / ఇంజనీరింగ్ గా కొలువుదీరిన తర్వాత వారికీ Pay Level -10 తో ప్రారంభ జీతంగా రూ 56,100 ఇస్తారు.దీనికి అదనంగా DA,HRA,TA వంటి ఇతర అలవెన్సులు కూడా జోడించి ప్రతి నెల ఇస్తారు.
Application Fee Details
ఎంపిక ప్రక్రియ
ఈ సైంటిస్ట్ / ఇంజనీరింగ్ ఉద్యోగాల కొరకు రెండు దశలలో ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
1.వ్రాత పరీక్ష ఆధారంగా
2.ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
1.వ్రాత పరీక్ష ఆధారంగా: ఈ మొదటి దశలో వ్రాత పరీక్షను రెండు విభాలుగా 100 మార్కులకు నిర్వహిస్తారు.
PART-A లో సంబంధిత సబ్జెక్టుల నుండి 80 ప్రశ్నలు అడుగుతారు.ఒక్కో ప్రశ్నకు 1 మార్కు ఉంటుంది.
PART-B లో 20మార్కులకు న్యూమరికల్ ఎబిలిటీ,లాజికల్ రీజనింగ్, డయాగ్రమేటిక్ రీజనింగ్, ఆబ్స్ట్రాక్ట్ రీజనింగ్, డిడక్టీవ్ రీజనింగ్ విభాగల నుండి 15 ప్రశ్నలకు గానూ 20 మార్కులలతో పరీక్ష నిర్వహిస్తారు.ఈ విధంగా రెండు పార్టీలు కలసి 100 మార్కులకు పరీక్షలు నిర్హహిస్తారు.
2.ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక – పైన తెలిపినట్టు వ్రాత పరీక్షలో ప్రతిభ కనపరచిన వారికీ ఒక్కో పోస్టుకి 5 మంది చొప్పున 1:5 నిష్ఫత్రిలో వ్యక్తిగతంగా ఇంటర్వ్యూ నిర్ర్వహిస్తారు.ఈ ఇంటర్వ్యూనకు 100 మార్కులు ఉంటుంది.
దరఖాస్తు విధానము
Online Apply Last Date – June,14 2023
Examination – ఈ ఏడాది చివరన సెప్టెంబర్ లో వుండే అవకాశం కలదు.పూర్తి వివరాలు ఈవెబ్సైట్ లోనే పరీక్ష దగ్గరలో తెలియజేస్తారు.
పరీక్ష కేంద్రాలు – ఈ పరీక్షల కొరకు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి హైదరాబాద్ నందు పరీక్ష నిర్వహిస్తారు.
Official Website – CLICK HERE
Online Apply & నోటిఫికేషన్ వివరాలు – CLICK HERE
.
JOIN WHATS APP
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకి సంధించిన సంక్షేమ పథకాలు మరియు జాబ్ అప్డేట్స్ కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ని ఎప్పటికప్పుడు ఈ గ్రూప్స్ నందు పోస్ట్ చేస్తుంటాను.కనుక ఆసక్తి వున్నవారు ఈ గ్రూప్ లలో జాయిన్ అయ్యి లబ్ధి పొందగలరు.