పరిచయం (Power Bill ) – RBI ఆదేశాల మేరకు ఇకపై కరెంట్ బిల్ (Power Bill) ఆన్లైన్ లో కట్టాలి అనుకున్నవారికి ఆయా ప్రాంతాల డిస్కంలకి సంబంధిచిన website లలో మాత్రమే కట్టుకోవాల్సి ఉంటుంది.కనుక ఇప్పటి వరకు చాలా మంది కూడా Phone pay,Google Pay, PAY TM లలో కట్టేవారు,కానీ క్రొత్తగా వచ్చిన ఆదేశాల మేరకు అధికారిక డిస్కం వెబ్సైటు లేదా మొబైల్ అప్లికేషన్ లలో మాత్రమే కట్టుకోవాలి.
గమనిక – Offline లో కట్టాలి అనుకున్న వాళ్ళు దగ్గర్లోని సచివాలయం మరియు మీసేవా కేంద్రాలలో కరెంట్ బిల్ చెల్లించవచ్చును.
APSPDCL వినియోగదారులు బిల్లు కట్టే విధానము (Power Bill)
- ఉమ్మడి చిత్తూరు జిల్లాకి (పాత) చెందిన వాళ్ళు
- ఉమ్మడి అనంతపురం జిల్లాకి (పాత) చెందిన వాళ్ళు
- ఉమ్మడి కర్నూలు జిల్లాకి (పాత) చెందిన వాళ్ళు
- ఉమ్మడి వైఎస్సార్ జిల్లాకి (పాత) చెందిన వాళ్ళు
- ఉమ్మడి నెల్లూరు జిల్లాకి (పాత) చెందిన వాళ్ళు
పై జిల్లాల వినియోగదారులు ఈ క్రింది వెబ్సైట్ల ద్వారా ONLINE లో కట్టుకోవచ్చును.
APSPDCL – WEBSITE
APSPDCL – MOBILE- APP
APCPDCL వినియోగదారులు బిల్లు కట్టే విధానము (Power Bill)
- ఉమ్మడి కృష్ణా జిల్లాకి (పాత) చెందిన వాళ్ళు
- ఉమ్మడి గుంటూరు జిల్లాకి (పాత) చెందిన వాళ్ళు
- ఉమ్మడి ప్రకాశం జిల్లాకి (పాత) చెందిన వాళ్ళు
పై జిల్లాల వినియోగదారులు ఈ క్రింది వెబ్సైట్ల ద్వారా ONLINE లో కట్టుకోవచ్చును.
APCPDCL – WEBSITE
APCPDCL – MOBILE- APP
APEPDCL వినియోగదారులు బిల్లు కట్టే విధానము (Power Bill)
- ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలకి (పాత) చెందిన వాళ్ళు
- ఉమ్మడి విశాఖపట్నం జిల్లాకి (పాత) చెందిన వాళ్ళు
- ఉమ్మడి విజయనగరం జిల్లాకి (పాత) చెందిన వాళ్ళు
- ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకి (పాత) చెందిన వాళ్ళు
పై జిల్లాల వినియోగదారులు ఈ క్రింది వెబ్సైట్ల ద్వారా ONLINE లో కట్టుకోవచ్చును.
APEPDCL – WEBSITE
APEPDCL – MOBILE- APP
Platform charges ఎంత?
- ఇంటర్నెట్ బ్యాంక్ ద్వారా డబ్బులు కడితే రూ.2.50 అదనంగా చెల్లించాల్సి వస్తుంది.
- డెబిట్ కార్డ్స్ ద్వారా చెల్లించినట్లయితే రూ 0.90% అదనంగా చెలించాల్సి వస్తుంది.
- క్రెడిట్ కార్డ్స్ ద్వారా చెల్లించినట్లయితే రూ 1.00% అదనంగాచెలించాల్సి వస్తుంది.
- భారత్ QR కోడ్ ద్వారా చెల్లించినట్లయితే రూ 0.85% అదనంగా చెలించాల్సి వస్తుంది.
- రూపే డెబిట్ కార్డ్స్ పై చెల్లింపులు చేసినట్లయితే ఎటువంటి అదనపు చార్జీలు వుండవు.
- UPI ద్వారా చెల్లింపులు చేసినట్లయితే ఎటువంటి అదనపు చార్జీలు వుండవు.
Online లో PAY చేయు విధానము
Website లలో కట్టాలి అనుకుంటే ఎటువంటి రిజిస్ట్రేషన్ లేకుండా కూడా సులభముగా కట్టుకోవచ్చును.
- మీ ప్రాంత డిస్కం లింక్ పై క్లిక్ చేసి చెల్లించాల్సిన కరెంట్ బిల్ నెంబర్ మరియు CAPTCHA ని ఎంటర్ చేసుకుని Submit ఫై క్లిక్ చేసుకోవాలి.
- రెండవ పేజీలో మీ బిల్ అమౌంట్ ఎంతో చూపిస్తుంది.
- మూడవ పేజీలో దేని ద్వారా డబ్బులు కడుతున్నారో ఎంచుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకి – Phone Pay ద్వారా అమౌంట్ కట్టాలి అనుకుంటే క్రింద UPI అనే ఆప్షన్ నందు Phone Pay ని ఎంచుకుని మీ UPI అడ్రెస్ ని ఎంటర్ చేయాలి. (9700XXXXXX@ybl – ఇది తెలియాలంటే Phone pay లో Profile పై లిక్ చేసుకుని ఓపెన్ చేసుకుంటే అక్కడ UPI అడ్రెస్ చూపిస్తుంది.)
- అక్కడ Make Payment చేయగానే phone pay లో చూపిస్తుంది.అక్కడ Confirm చేసినట్లయితే బిల్ పేమెంట్, ఎటువంటి అదనపు చార్జీలు లేకుండా చెల్లించే అవకాశం ఉంటుంది.
Mobile App ద్వారా కట్టాలి అనుకుంటే ఎటువంటి రిజిస్ట్రేషన్ లేకుండా కూడా సులభముగా కట్టుకోవచ్చును.
- మీ సర్వ్వేసు నెంబర్ మరియు మొబైల్ నెంబర్ తో రిజిస్టర్ అయి కూడా చెల్లించవచ్చును.దీనివలన ప్రతి నెల బిల్ కట్టేటప్పుడు సర్వీసు నెంబర్ ఎంటర్ చేయాల్సియాన్ అవసరం ఉండదు.
- ఈ యాప్ లో రిజిస్ట్రేషన్ కాకుండా కూడా Quick Pay ఆప్షన్ ద్వారా డైరెక్ట్ గా బిల్ కట్టుకోవచ్చును.
- పై Quick Pay ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాక సర్వీసు నెంబర్, మొబైల్ నెంబర్ ఇచ్చి క్లిక్ చేసుకోవాలి.
- ఈ పేజీలో బిల్ అమౌంట్ చెక్ చేసుకుని PAY మీద క్లిక్ చేసుకుని,Bill DESK మీద క్లిక్ చేసుకొవాలి.
- మరుసటి పేజీలో UPI,OTHER PAYMENTS అనీ రెండు ఆప్షన్స్ వస్తాయి.అక్కడ UPI సెలెక్ట్ చేసుకుని ఏదైనా Phone pay, Google Pay, Pay TM లకు సంబంధించిన అడ్రెస్స్ ని ఎంచుకుని PAY చేయవచ్చును.
- Other Payments ఎంచుకుంటే మిగిలిన ఇంటర్నెట్ బ్యాంకింగ్,డెబిట్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్ వంటి మీద PAY చేయవచ్చును.
Related Links
ఆధార్ కి ఏ మొబైల్ నెంబర్ లింక్ అయిందో తెలుసుకునే లింక్