Introduction (12 D)
12 D Form – కేంద్ర ఎన్నికల సంఘం పోలింగ్ కేంద్రం దగ్గరకి రాలేని వృద్దులు కొరకు మరియు వైకల్యం కలిగిన వారి కోసం ప్రత్యేకంగా ఇంటివద్దనే ఉండీ బ్యాలెట్ పేపర్ ద్వారా ఓటింగ్ వేయుటకు అవకాశం కల్పించారు. కనుక దేశవ్యాప్తంగా ఇలాంటి అవకాశం ఒకటి వుంది అనే విషయాన్ని ప్రజలకు అవగాహన పరచాలి అనే ఉద్ధేశ్యంతోనే మనం ఇప్పుడు ఈ బ్లాగ్ నందు దరఖాస్తు ఎలా చేసుకోవాలో అని వ్రాస్తున్నాము కనుక ఈ సమాచారం తెలుసుకున్న వారందరూ ఖచ్చితంగా మీ చుట్టుప్రక్కల వారికి ఈ సమాచారం తెలియపరచి వారందరికీ సహాయం చేయగలరని ఆశిస్తున్నాను.
ఈ ఓటింగ్ వేయుటకు ఎవరు అర్హులు ? (12d Form)
1) 85 సంవత్సరాలు పైబడిన వారందరూ అర్హులే
2) 40 % మరియు అంతకంటే ఎక్కువ అంగవైకల్యం కలిగిన వారందరూ కూడా అర్హులే
- రాష్ట్రంలో 85 సంవత్సరాలు వయస్సు కలిగిన వాళ్ళు – 2,11,088 మంది ఓటర్లు
- 40% వైకల్యం కలిగిన వారు – 5,18,193 మంది ఓటర్లు
వీళ్ళు ఖచ్చితంగా ఇంటిదగ్గరే నుండే ఓటు వేయాలా ? (12d Form)
కేంద్ర ఎన్నికల సంఘం చెప్పిన సమాచారం ప్రకారం పైన తెలిపిన వాళ్ళు పోలింగ్ బూత్ వద్దకి వెళ్లి ఓటు హక్కు ని స్వేచ్ఛగా వినియోగించుకోవచ్చు. లేదా మేము అక్కడకి వెళ్లలేము అని అనుకునే వాళ్లు మాత్రం మీ ఇష్టపూర్వకంగా ఇంటి వద్దనే వుండి కూడా ఓటు వేయవచ్చును.కనుక అలాంటి వారి కోసమే ఈ అవకాశాన్ని తేవడం జరిగిందని తెలియజేస్తున్నారు.
ఇంటి వద్దనే ఓటు వేయాలంటే ఏమి చేయాలి ? (12d Form)
- రాష్ట్రంలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తరువాత రోజు నుండి 5 రోజుల లోపు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
- మీ ఏరియా B.L.O ద్వారా 12 D ఫారం ని నింపి R.O (Returning Officer) కి అందజేయాలి.
మా B.L.O ఎవరో మాకు ఎలా తెలుస్తుంది ?
ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన ఓటర్లకు మీ సచివాలయ ఉద్యోగులనే B.L.O (Booth Level Officer ) గా నియమించారు.వాళ్ళు ఈ ఎన్నికల అయ్యేవరకు ఈ డ్యూటీస్ చేస్తారు కనుక వెళ్లి సంప్రదించండి. లేదా మనమే కూడా online లో మనకు సంబంధించిన B.L.O ని ఈ క్రింది లింక్ ద్వారా పేరు,మొబైల్ నెంబర్ కూడా తెలుసుకుని సంప్రధించవచ్చును.
12 D ఫారం ఎక్కడ దొరుకుతుంది ?
ఈ 12 D అప్లికేషన్ ని మీ B.L.O తెచ్చి ఇచ్చి మీ వివరాలు సేకరించి R.O గారికి మీ దరఖాస్తును అందజేస్తారు.లేదా మీరే కూడా ఈ క్రింది లింక్ ద్వారా PDF ని Download చేసుకోగలరు.
ఈ 12 D ఫారం తో పాటు ఎయే వివరాలు అందజేయాలి ?
- ఈ ఫారం నింపేటప్పుడు మీ అసెంబ్లీ / పార్లమెంట్ ని వ్రాయాలి.
- ఓటరు లిస్ట్ లో సిరిల్ నెంబర్ ని కూడా వ్రాయాలి.
- చిరునామా,మొబైల్ నెంబర్ కూడా ఇవాల్సి ఉంటుంది.
- వయస్సు మరియు వైకల్యం కలిగిన వాళ్ళు అయితే వాకల్యం సర్టిఫికెట్ కూడా జత చేయాల్సి వుంటుంది.
ఈ అప్లికేషన్ ని ఎవరి చేత అందజేయాలి ? (12 D Form)
మీరు ఇంటి వద్దే వుంది ఓటు వేయాలనుకుంటే నోటిఫికిషన్ వచ్చిన 5 రోజుల లోపల Returning అధికారికి దరఖాస్తు చేసుకోవాలి కనుక .ఈ ప్రక్రియ మొత్తం దగ్గరుండీ మీ B.L.O చూసుకుని మీ దరఖాస్తుని సంబంధిత R.O కి అందజేస్తుందటారు.
ఇంటి దగ్గర ఓటింగ్ వేయు విధానము ఎలా ?
- దరఖాస్తు చేసుకున్నాక భద్రతా సిబ్బంది,మరియు పోలింగ్ అధికారులు ఇంటికి వస్తారు.
- దరఖాస్తుదారుని ఇంటి వద్దకి వచ్చేటప్పుడు ముందస్తుగా సమాచారం ఇస్తారు.
- ఈ రకమైన ఓటర్ల వివరాలని అభ్యర్థులకు కూడా తెలియజేస్తారు.
- భద్రతా సిబ్బంధి ఆదీనంలో చాలా గోప్యంగా రహస్య ఓటింగ్ వేయిస్తారు.
- ఓటు వేసేటప్పుడు వీడియో కూడా తీస్తారు.
- వీడియో లో ఎక్కడా కూడా ఎవరికి ఓటు వేసారో తెలియకుండా గోప్యతని పాటిస్తారు.
- ఆ తరువాత ఆ బ్యాలెట్లను,బాక్స్ లో వేసి రిటర్నింగ్ అధికారులకు అందజేస్తారు.
వైకల్యం వున్న వారికోసం ప్రత్యేక మొబైల్ యాప్ ..?
కేంద్ర ఎన్నికల సంఘం విభిన్న ప్రతిభావంతుల కోసం ప్రత్యేకంగా ఒక మొబైల్ యాప్ ని రూపొందించారు.ఈ మొబైల్ యాప్ పేరు Saksham-ECI .

- ఈ యాప్ ఫ్లే స్టోర్ లో ఉంటుంది కనుక డౌన్లోడ్ చేసుకోగలరు.
- ఈ యాప్ లో ఓటరు మొబైల్ నెంబర్ తో రిజిస్టర్ చేసుకున్నాక, చాలా సర్వీసులు అందుబాటులో ఉంటాయి.
- క్రొత్తగా ఓటు కార్డు కొరకు దరఖాస్తు చేసుకోవచ్చును.
- Facility At Polling Station అనే ఆప్షన్ ద్వారా వాకల్యం కలిగిన వారికీ చాలా మంచి సర్వీసులు అందుబాటులో ఉంచారు.
- Request For Wheel Chair – ఈ ఆప్షన్ ద్వారా వివరాలు ఇచ్చి ,పోలింగ్ స్టేషన్ కి వెళ్లి రావటానికి వీల్ చైర్ ని కోరినచో, పోలింగ్ సిబ్బంది మీకు సమకూర్చుతారు.
- Request For Volunteer – ఇక్కడ వాలంటీర్ అంటే ఆంధ్రప్రదేశ్ లో వున్న గ్రామ వాలంటీర్ కాదు.వాళ్ళు ఎవరంటే స్వచ్చంధంగా ఈ విధంగా వైకల్యం వున్న వారికి మరియు వృద్దులకు తోడుగా,సహాయం చేయడానికి ఒక మనిషి కావాలని కోరవచ్చును. అలా కోరినచో పోలింగ్ సిబ్బంది సమకూర్చుతారు.
- Pick and Drop అనే ఆప్షన్ ద్వారా పోలింగ్ స్టేషన్ వెళ్లి, మళ్ళీ తిరిగి రావడానికి వాహనాన్ని కూడ కోరవచ్చును.
ఎన్నికల ఉన్నత అధికారులకు ఎలా కంప్లైంట్ ఇవ్వాలి ?
పైన చెప్పిన సర్వీసులు అన్నీ కూడా ప్రజల సౌకర్యార్ధం కొరకు ఎన్నికల కమీషన్ ఇలాంటి అవకాశాలను తేవడం జరిగింది.కనుక మీరు దరఖాస్తు చేసుకున్నాక స్థానిక పోలింగ్ అధికారులు సరైన సర్వీసు అందిచకుండా ఇబ్బంది పెట్టినట్లయితే ఈ క్రింది నంబర్స్ కి కాల్ చేసి తెలుపవచ్చును.
- ఎన్నికల ప్రధాన Toll free నెంబర్ – 1950, కనుక ఈ నెంబర్ కి కాల్ చేసి సమాచారం ఇవ్వవచ్చును.
- మీ B.L.O ని ఎలా తెలుసుకోవాలో పైన ఒక వెబ్సైటు లింక్ ఇచ్చాను.దాని ద్వారా మీ జిల్లాలోని పోలింగ్ ఉన్నత అధికారి యొక్క మొబైల్ నెంబర్ కూడా చూపిస్తుంది.కనుక అలా కూడా వారికీ సమాచారాన్ని చేరవేయచ్చును.
- వైకల్యం వున్న వారికోసం అందుబాటులో ఉంచిన Saksham ECI అనే మొబైల్ యాప్ లో కూడా ఈ క్రింది చూపించిన ఆప్షన్ దగ్గర మీ రాష్ట్రన్ని ఎంచుకుని,రాష్ట్ర అధికారి లేదా జిల్లా అధికారి యొక్క మొబైల్ నెంబర్ ద్వారా కూడా కంప్లైంట్ ఇవ్వవచ్చును.
Related Links
Conclusion
ఈ పేజీ లో తెలిపిన సమాచారం మాత్రం మన చుట్టుప్రక్కల వృద్దులు,అంగవైకల్యం వున్నవారు పోలింగ్ స్టేషన్ కి వెళ్లి ఓటు వినియోగించుకోవడానికి ఇబ్బంది పడే వారికోసం చాలా మంచి అవకాశం,కనుక ఖచ్చితంగా ఈ సమాచారాన్ని తెలిసిన వారందరూ వినియోగిస్తారని కోరుకుంటూ ఈ బ్లాగ్ ముగిస్తున్నాను.
ఇంకా ఇలాంటి సమాచారాలు ఏమైనా కావాలన్నా,లేదా ఇంకేమైనా సందేహాలు వున్ననూ ఈ క్రింది Whats app గ్రూప్ లో జాయిన్ అయ్యి నివృత్తి చేసుకోగలరు.