YSR Pension Kanuka: వైస్సార్ పెన్షన్ కానుక రూపంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి ఎలాంటి సిఫార్సులు,లంచాలతో పని లేకుండా అర్హత ఒక్కటే ప్రామాణికంగా తీసుకుని సంవత్సరానికి రెండు సార్లుYsr Pension Kanuka ను మంజూరు చేస్తూ వున్నారు.అది ఒకసారి జనవరి నుండి మే నెల మధ్య వరకు దరఖాస్తు చేసుకుని ఫైనల్ లెవెల్ లో కూడా అప్ప్రొవ్ కూడా ఎవరికైతే అవుతుందో అలాంటి వారికీ జూన్ నెలలో క్రొత్త పెన్షన్మంజూరు చేస్తారు.అదేవిధంగా జూన్ నెల నుండి డిసెంబర్ నెల వరకు ఎవరైనా దరఖాస్తు చేసుకుని ఫీల్డ్ లెవెల్ వెరిఫికేషన్ కూడా పూర్తి చేసుకున్నవారికి జనవరి లో క్రొత్త Ysr Pension Kanuka ను మంజూరు చేసున్నారు.ఈ విధంగా ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ లో ఇస్తున్న Ysr Pension Kanuka రూపంలో దాదాపు 64 లక్షల పెన్షన్స్ కి నెలకు కోట్లు 2500 ఖర్చుచేస్తున్నారు.
ఈ మధ్య వచ్చిన నూతన సమాచారం ప్రకారం గత జనవరి నెల నుండి మే నెల మధ్యలో క్రొత్తగా Ysr Pension Kanuka దరఖాస్తు చేసుకుని ఆ అప్లికేషన్స్ ఫైనల్ లెవెల్ లో అంటే గ్రామాలకి సంబంధించి అయితే MPDO గారి యొక్క లాగిన్ లో Approved అని, అదేవిధముగా పట్టణాలకు సంబంధించి అయితే మున్సిపల్ కమీషనర్ యొక్క లాగిన్ లో మే నెల లోపల అన్ని వెరిఫికేషన్స్ పూర్తి చేసుకుని ఫైనల్ లో Approved అని వచ్చి ఉంటే అలాంటి వారికీ జూన్ నెలలో Bi-Annual అనే కార్యక్రమం ద్వారా క్రొత్త Ysr Pension Kanuka మంజూరు అవుతాయని ఉన్నత అధికారుల నుండి ఇప్పటివరకు వున్న ప్రాథమిక సమాచారం.కనుక అప్పుడు పేర్లు ప్రకటన చేస్తే ఆ లబ్ధిదారులకు e kyc చేయాల్సి ఉంటుంది.ఆ తదుపరి జులై నెల నుండి క్రొత్త పెన్షన్స్ ద్వారా డబ్బులు అందే అవకాశం ఉంటుంది.ఇప్పుడు ఇదే పేజీ లో మనం ఫైనల్ స్టేజీ అయినా MPDO / MC యొక్క లాగిన్ లో Approved అని ఉందా..లేదా Reject అని వుతుందా అని సులభంగా ఆధార్ కార్డు నెంబర్ ద్వారా తెలుసుకుందాం.
Ysr Pension Kanuka Status Checking
వైస్సార్ పెన్షన్ ఫైనల్ లెవెల్ లో Approved అయిందా లేదా Reject అయిందా అని తెలుసుకోవడం ఎలా?
మనం పైన చెప్పిన విధంగా క్రొత్త పెన్షన్స్ మంజూరు అయ్యాయా లేదా అని సులభంగా మొబైల్ లో అయినా అదేవిధముగా కంప్యూటర్ లో అయినా ఈ క్రింది వివరాలు ఆధారంగా చెక్ చేసుకోవచ్చును.
క్రొత్తగా పెన్షన్ పెట్టుకున్న అర్జీదారుని యొక్క ఆధార్ నెంబర్ ద్వారా ద్వారా ఆచెక్ చేసుకోవాలంటే ముందుగా పై లింక్ పై క్లిక్ చేసుకుంటే ఈ క్రింది విధమైన పేజీ ఓపెన్ అవుతుంది.
ఇక్కడ Enter Your Adhar అనే ఆప్షన్ దగ్గర మీ ఆధార్ నెంబర్ ని ఎంటర్ చేసి Search అనే సింబల్ పైన క్లిక్ చేయాలి.ఇక్కడ ఓక విషయాన్నీ గమనించాలి,మీరు మొబైల్ లో ఓపెన్ చేసుంటే ఈ ఆప్షన్ చివర్లో వస్తుంది.కనుక అక్కడ మీ ఆధార్ నెంబర్ ని ఎంటర్ చేయాల్సివుంటుంది.
అప్లికేషన్ నెంబర్ ద్వారా
ఇక్కడ అప్లికేషన్ నెంబర్ అంటే మీరు సచివాలయం లో నూతన పెన్షన్ కొరకు దరఖాస్తు చేసుకున్నప్పుడు ఒక నెంబర్ వస్తుంది.దానినే Ysr Pension Kanuka అప్లికేషన్ నెంబర్ అంటారు.ఇది మీ మొబైల్ కి Massage రూపంలో కూడా వచ్చివుంటుంది. కంప్యూటర్ లో ఓపెన్ చేసిన వారు అయితే ఈ ఆప్షన్ చివరన Service Request Status Check అనే ఆప్షన్ వస్తుంది.అదే మొబైల్ లో అయితే మొట్ట మొదట ఆప్షనే వస్తుంది. కనుక చాలా సులభంగా మీ వివరాలు ఎంటర్ చేసుకోవచ్చు.
Status Checking
ఈ క్రింది ఫోటో లో చూపిన విధంగా మీరు సచివాలయంలో దరఖాస్తు చేసుకున్నదగ్గరనుండి ఫైనల్ స్టేజి అయినా MPDO /MC గార్ల దగ్గర కూడా Approved అని వస్తే ఈ జూన్ నెలకు క్రొత్త Ysr Pension Kanuka వస్తాయి.
ఏ రాష్ట్రము లో లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము నందు చాలా పారదర్శకంగా కులం,మతం,ప్రాంతం,వర్గం,పార్టీ అనే తేడా లేకుండా అర్హత వున్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అందలి అనే దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి జగన్మోహాన్ రెడ్డి గారు చేస్తున్నారు.అందుకోసం క్రింది స్థాయిలో గ్రామా సచివాలయాలు,అదేవిధంగా వాలంటీర్స్ ని పెట్టి తద్వారా అన్ని పథకాలు ప్రజలకు అందిస్తున్నారు.అయినా కూడా అక్కడక్కడా కొన్ని చోట్ల రాజకీయ ఒత్తిడులు లేదా అధికారుల నిర్లక్యం వలన కొంతమంది పథకాలను పొందలేక పోతున్నారు.కావున ,ముఖ్యమంత్రి గారు జగనన్నకి చెబుతాం అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది.కావున అర్హత వుండి మీకు లబ్ది చేకూరకపోతే 1902 అనే నెంబర్ కి కాల్ చేసి సమస్యని తెలుపవచ్చును.
Conclusion
నేను మీ మద్దిమడుగు మునిరత్నం, ఈ పేజీ నందు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి Ysr Pension Kanuka దరఖాస్తు దారులు ఎవరైతే వున్నారో వారికోసం చాలా అంశాలను అంటే Ysr Pension Kanuka Status ఈ 2023 సంవత్సరానికి క్రొత్వి ఎప్పుడు రిలీజు అవుతాయి.వాటిని మనమే ఆన్లైన్ లో ఎలా చెక్ చేసుకోవాలి అనే అంశాలను చర్చించుకోవడం జరిగింది. కనుక ఇంకా ఏదైనా ఈ సమాచారం పై సందేహాలు వున్నచో నాకు సంబంధించిన Whatsapp గ్రూప్స్ వున్నాయి.కనుక దాని ద్వారా నాకు తెలుపగలరు.అందులో మీ సందేహాలను నివృత్తి చేస్తాను.
Contact Me
కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన సంక్షేమ పథకాలు గానీ అదేవిధంగా ఉద్యోగ నోటిఫికేషన్లు గానీ మరియు పోటీ పరీక్షలకు సంబంధించిన ఫలితాలకు సంబంధించిన లింక్స్ గానీ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవాలంటే ఈ క్రింది గ్రూప్ నందు చేరి తెలుసుకోవచ్చును.