పెంచిన పింఛను వివరాలు
1. పెన్షన్ నగదును గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది వారు సాధారణ సెలవులతో సంబంధం లేకుండా ప్రతి నెలలో 1వ తేదీనే ఉదయమే ఫించన్ దారుల ఇంటింటికి పోయి పంపిణీ చేయవలసి ఉంటుంది.
2. ఇందులో వాలంటీర్లు ప్రమేయం ఉండకూడదు
3. వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళలు, చేనేత, కల్లుగీత కార్మికులు, మత్స్యకార, చెప్పులు కుట్టే వృత్తివారు, ట్రాన్స్‌జెండర్లు, ఏఆర్‌టీ, డప్పు కళాకారులు, ఆర్టిస్టు పెన్షన్‌దారులకు రూ.3వేల నుంచి రూ.4 వేలకు పెంపు
4. దివ్యాంగులు, కుష్టురోగులకు అందించే పింఛన్లు రూ. 3వేల నుంచి రూ.6 వేలకు పెంపు.
5. పూర్తిస్థాయిలో వైకల్యానికి గురైన వారికి నెలకు రూ.15 వేలు పింఛన్ పెంపు
6. కిడ్నీ తలసీమియా వంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు రూ.5 వేల నుంచి రూ.10 వేలు పింఛన్ పెంపు.
పెన్షన్ పంపిణీ చేయు సిబ్బంది ఖచ్చితంగా అనుసరించాల్సిన అంశాలు
✓ పెన్షన్ల పంపిణీకి గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందిని వినియోగించుకోవాలని, అవసరమైన చోట ఇతర శాఖల ఉద్యోగులనూ పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది.
✓ ఒక్కో ఉద్యోగికి 50 మంది లబ్ధిదారులకు మించకుండా కేటాయించాలని ఉత్తర్వులు జారీ చేసింది.
✓ జులై 1న ఉ.6 గంటల నుంచి ఇళ్ల వద్దకే వెళ్లి పెన్షన్ ఇవ్వాలి. అదే రోజు పంపిణీ పూర్తి చేయవలెను.
✓ వీలైనంత వరకు మొదటి రోజే అందరికీ నగదు అందించాలి.
✓ ఫించన్ పంపిణీలో వాలంటీర్లు ప్రమేయం ఉండకూడదు. వారి సహాయం తీసుకోకూడదు.
పింఛన్ల పంపిణీకి సంబంధించిన పూర్తి links ఇక్కడ ఇవ్వడం జరిగింది.కావున సులభంగా ఉపయోగించుకోగలరు.
NTR BHAROSA PENSIONS APP LINKS
DASH BOARD LINKS
PENSION STATUS LINK
BIO METRIC LINKS
Related Links
మీ పాన్ కార్డు కి ఆధార్ కార్డు లింక్ అయిందో లేదో తెలుసుకునే విధానం
పెంచిన 20 రకాల ఎన్టీఆర్ భరోసా పింఛన్లు