Introduction
What Is Household Mapping?
Household: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం దారిద్ర్య రేఖకు దిగువున వున్న కుటుంబాలకు వివిధ సంక్షేమ రకాల సంక్షేమ పథకాల రూపంలో, వివిధ వర్గాలకు చెందిన అర్హులకు ఉచితంగా ఆర్ధిక సాయం చేస్తుంది. కావున అది నిజమైన అర్హులకు మాత్రమే చేరాలని వివిధ రకాలుగా వెరిఫికేషన్ చేస్తూ వుంటారు.అందులో భాగంగానే గ్రామా/వార్డు వాలంటీర్లకు ఒక మొబైల్ యాప్ ఇచ్చి తద్వారా అందరి కుటుంబ సభ్యులను ఒక హౌస్ మాపింగ్ గా చేసారు.దీనినే household Mapping data అంటారు.కావున ఏ సంక్షేమ పథకం అందాలన్నా లేదా మరియు ప్రభుత్వ రికార్డులలో వీళ్ల్లంతా ఒక కుటుంబానికి చెందిన వారు అని తెలియజేయుటకు ఆంద్రప్రదేశ్ రాష్ట్రము లో ఈ పద్దతిని ఉపయోగిస్తున్నారు.తద్వారా సచివాలయం లో ఏ సర్వీస్ కి దరఖాస్తు చేయాలన్న ఇబ్బంది లేకుండా ఉంటుంది.
ప్రభుత్వ రికార్డులలో కుటుంభ సభ్యులను సులభముగా కనుకొనే విధానము
దీనికి సంభందించి రెండు రకాలుగా చెక్ చేసుకోవచ్చును.
- వాలంటీర్ మొబైల్ యాప్ ద్వారా
- Online మీరే చెక్ చేసుకునే విధానము
వాలంటీర్ మొబైల్ యాప్ ద్వారా
ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ ని నియమించి వారికీ Grama Volunteer అనే మొబైల్ యాప్ ఇచ్చారు.అందులో వాలంటీర్ ఆధార్ తో లాగిన్ అయ్యాక “కుటుంబ వివరాలు” అనే ఆప్షన్ ద్వారా చూసుకోవచ్చు.ఇక్కడ మీకు సంబంచిన వాలంటీర్ కాకపోయినా పర్వాలేదు అక్కడ కుటుంబాన్ని జోడించండి అనే ఆప్షన్ లో మీ ఆధార్ ఎంటర్ చేసినట్లయితే మీ కుటుంభంలో ఎంతమంది సభ్యలు ప్రభుత్వ రికార్డులలో వున్నారు అనే విషయాన్ని household Data తెలుసుకోవచ్చు.
Online లో మీరే ఆధార్ నెంబర్ తో household Data కనుగొనే విధానము
LINK : https://gramawardsachivalayam.ap.gov.in/GSWS/#!/PublicNavasakamScreen
STEP 1: పై లింక్ పై క్లిక్ చేసుకున్నాక ఈ క్రింది విధముగా పేజీ వస్తుంది.ఇక్కడ మీ కుటుంభం సభ్యులలో ఎవరిదైనా ఆధార్ నెంబర్ ని ఇవ్వాల్సివుంటుంది.కానీ ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అదేమిటంటే ఈ household Data సర్వీస్ మీరు ఉపయోగించుకోవాలంటే మీ ఆధార్ కి మొబైల్ నెంబర్ లింక్ ఉండాలి.
STEP 2: పైన ఆధార్ నెంబర్ ఇచ్చి GET DETAILS పై ఎంటర్ చేసాక ఈ క్రింది విధంగా మీ మొబైల్ నెంబర్ కి వచ్చిన OTP ని ఎంటర్ చేయండి అని చూపిస్తుంది.
STEP 3: ఇక్కడ OTP ని ఎంటర్ చేసాక మీ కుటంబానికి సంబంధించిన పూర్తి వివరాలు అంటే మీరున్న సచివాలయం పేరు,మీకు ప్రభుత్వం కేటాయించిన వాలంటీర్ వివరాలు ఇవ్వన్నీ అక్కడే చూపిస్తాయి.దానితో పాటు ఇప్పుడు ప్రభుత్వ రికార్డులలో మీ కుటుంభం సభ్యులు ఎంతమంది వున్నారో చూసుకునే household Data అవకాశం కలదు.కావున ఈ వివరాలు ఆధారంగానే మీకు సంక్షేమ పథకాలు అనేవి రావడానికి దోహదపడతాయి.కావున ఈ విధంగా సభ్యులను చెక్ చేసుకుని ఇంకా ఎవరైనా ADD కాకపోతే ఈ క్రింది మీ వాలంటీర్ ని వివరాలు అడిగి సచివాలయం లో సభ్యులను జోడించుకొండి.
Also Read: Scheme Eligibility ని మీరే ఆధార్ తో చెక్ చేసుకునే వెబ్సైటు
అధికారులు సరైన వివరాలు ఇవ్వకపోతే మేము ఏమి చేయాలి?
రాష్ట్ర ప్రభుత్వం అర్హత వున్న ప్రతి ఒక్కరికి అన్నీ సంక్షేమ పథకాలు అదేవిధంగా పౌర సేవలు వారికి హక్కుగా అందాలి.అంతేగానీ అడుక్కుని కాదు అనే నిననాదంతోనే పనిచేస్తూ,ఎక్కడైనా పొరపాట్లు ఉంటే సరిదిద్దే అవకాశాలను అధికారులకు కూడా ఇవ్వడం జరిగింది.కావున ప్రతి ఒక్కరికి ఈ అవకాశాలను వినియోగించుకునే అర్హతలు వున్నాయి.ఒకవేళ మీకు అర్హత ఉండి కూడా స్థానికంగా వాలంటీర్ గానీ,సచివాలయ సిబ్బంది గానీ,లేదా ఏ ఇతర రాజకీయ నాయకులు గానీ సరైన సమాధానం ఇవ్వక ఇబ్బంది పెడుతుంటే ముఖ్యమంత్రి గారు జగనన్నకి చెబుదాం అనే కార్యక్రమం ద్వారా 1920 అనే నెంబర్ కి కాల్ చేసి మీ సమస్య ని చెప్పుకోవచ్చును.లేదా ఆన్లైన్ లో కూడా ఫిర్యాదు చేసే అవకాశం కలదు.
Conclusion
ఈ పేజీ నందు ప్రధానముగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము నందు నివసించు ప్రతి కుటుంభంకూడా వారి యొక్క కుటుంభం సభ్యుల వివరాలను Grama Ward Sachivalayam అనే పోర్టుల నందు నిక్షిప్తం చేయడం జరిగింది.కావున ప్రజలు పౌర సేవలుకి గానీ అదేవిధంగా వివిశ రకాల సంఖేమా పథకాలకొరకు గానీ దరఖాస్తు చేసుకోబోయే ముందు ఒక్కసారి ఈ వివరాలను కూడా సరిచూసుంటే అనర్హత జాబితా లో పేరు రాక మునుపే సరిచేసుకోవచ్చును.