Ammavodi scheme eligibility list check-2023

Written by Munirathnam

Updated on:

What is Jagananna Ammavodi Scheme?

   Jagananna ammavodi scheme అనేది ఆంధ్ర ప్రదేశ్ లో నిరక్షరాస్యతని తగ్గించడానికి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు విన్నూతనమైన ఆలోచనలతో ఏర్పడ్డ పథకమే ఈ జగనన్న అమ్మఒడి పథకం.ఈ పథకం నందు పిల్లలను సక్రమంగా బడులకు పంపించే తల్లులకు డైరెక్ట్ గా వారి బ్యాంక్ ఖాతాలకు సంవత్సరానికి రూ15,000 లను అందిస్తున్నారు.దీనిని 1వతరగతి నుండి 12 వ తరగతి వరకు చదువుతున్న పిల్లల తల్లులకు ఈ Jagananna ammavodi scheme ద్వారా దాదాపు 46 లక్షల కుటుంబాలకు కొంచెం అటూ ఇటూగా దాదాపుగా ప్రతి సంవత్సరం 6,500 కోట్లు ఆర్ధిక సాయం చేస్తూ ముఖ్యమంత్రి గారు  అనుకున్న ఆశయాలను సాధిస్తూ వున్నారు.

 

ఈ పథకం యొక్క నేపథ్యం

 

  jagananna ammavodi scheme అనేది ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు గతంలో పాదయాత్ర చేస్తున్న సమయం లో మ్యానిఫిస్టో ని ప్రకటిస్తూ అంధులో  ముఖ్యంగా చెప్పిన విషయాలు తన పాదయాత్ర లో తల్లులు తన దగ్గరకి వచ్చి పిల్లలను మంచి చదువులు చదివించుకోవాలంటే చాలా భారంగా వుంది. కనుక కుటుంభంలో ఒకరిని చదింవించుకుంటూ మరొకరిని బయట పనులకు పంపిస్తున్నాము అని తమకష్టాలను వెల్లడించుకున్నారని కావున ఇక మీదట అలాంటి  పరిస్థితులు ఇక ఉండకూడదు  అని హామీ ని ఇస్తూ మీ పిల్లలకి ఒక మేనమామ లాగా నేను తోడుగా ఉండి మీ పిలల్లకు ఎంతవరకు చదువుకుంటే అంత నేను చదివిస్తానని హామీ ఇస్తూ 1 వ తరగతి నుండి 12 వతరగతి వరకు బడులకు పంపించే తల్లులకు కుటుంభంలో ఒక విద్యార్థి కి jagananna ammavodi scheme ద్వారా సంవత్సరానికి 15,000 రూపాయలను మరియు ఆ పై చదువులు చదువుతున్నాఎంతమంది పిల్లలకైనా జగనన్న విద్యాదీవేన మరియు జగనన్న వసతి దీవెన అనే పథకాల ద్వారా వారి కోర్సు యొక్క మొత్తం ఫీజుని నేరుగా మధ్యవర్తిత్వం అనేది లేకుండా DBT (Direct Benefit Transfer) ద్వారా ఆధార్ అనుసంధానం అయినా తల్లుల బ్యాంక్ అకౌంట్ లకు వేయడం జరుగుతువుంది.ఇప్పటికే అమ్మఒడి పథకం 3 పర్యాయాలు దిగ్విజయంగా వేయడం కూడా జరిగింది.

 

2023 ammavodi Release Date?

 

మనం ఈ పోస్టు వ్రాస్తున్నఈ రోజు నాటికీ Jagananna ammavodi scheme కి సంభందించి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శాసన సభ లో ప్రకటించిన ఈ 2023-24 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన సంక్షేమ క్యాలెండర్ ప్రకారం జూన్ నెలలో ఉంటుంది.కనుక ఇంకా స్పష్టమైన తేదీలు మరియు నూతన సమాచారాలు తెలుసుకోవాలి అనుకుంటే మన వెబ్సైటు ని Subscribe చేసుకుని ఫాలో అవుతూ వుండండి, నేను ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తుంటున్నాను.దీంతో పాటు వివిధ రకాల సంక్షేమ పథకాలలో సందేహాల నివృత్తి కొరకు ఈ క్రింది వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవగలరు.

 

JOIN WATSAPP

 

Amma Vodi scheme eligibility list

 

ఈ ఆర్ధిక సంవత్సరం లో jagananna ammavodi కి సంబంధించి గ్రామా/వార్డు సచివాలయ శాఖ డైరెక్టర్ లక్ష్మీ గారు అధికారుకులకు ఇచ్చిన ఆదేశాలు ఏమనగా ఈ జూన్ 13, 2023 నాటికి కల్లా అమ్మఒడి జాబితా సిద్ధం కావాలని అదేవిధముగా ఈ మేనెల 25 వ తేదీ కల్లా క్షేత్ర స్థాయి పరిశీలనలు పూర్తి కావాలని మరియు అర్హులైన ఎవ్వరు ఎట్టి పరిస్థితుల్లో పథకం లబ్ది పొందకుండా మిగిలిపోకూడదు అని తెలియజేసారు.

 

What’s Basic eligibilities in ammvodi scheme?

 

ఈ జగనన్నఅమ్మఒడి పథకం ద్వారా లబ్ది పొందాలి అనుకున్న తల్లి తండ్రులు తప్పకుండా ఈ క్రింది అంశాలును ఎల్లప్పుడూ పరిగణలోకి తీసుకోవలెను.

  1. ప్రతి విధ్యార్ధికి పాఠశాలలో 75% హాజరు తప్పక ఉండవలెను 
  2. సచివాలయ పరిధిలో వాలంటీర్ యొక్క హౌస్ మాపింగ్ లో తల్లి,పిల్లలు ఒకే హౌస్ మాపింగ్ లో ఉండవలెను.
  3. రైస్ కార్డు కచ్చితంగా వుండవలెను.ఇది ఉంటే ప్రభుత్వం లెక్క ఆప్రకారం దారిద్ర్య రేఖకు (BPL Familes) దిగువుగా ఉన్నట్లు పరిగణిస్తారు.

కొంతమందికి వెసులుబాటు : Income tax కడుతున్నారని ఇప్పటివరకు కొంతమంది చాల సంక్షేమ పథకాలు పొందలేకపోయారు.అలాంటి సమస్య లను గ్రీవెన్స్ పెట్టినా కూడా సమస్య ఇంకా మిగిలివుండదాన్ని గుర్తించిన ప్రభుత్వం ఈ జూన్ నుండి ఇచ్చే అన్ని పథకాలకు రైస్ కార్డు లేకపోయినా మీ సచివాలయ పరిధిలో ప్రభుత్వం చెప్పిన ఆదాయ నిబంధనలకి లోబడి మీ సచివాలయ VRO  ద్వారా ఆదాయ ధ్రువీకరణ సర్టిఫికెట్ తెచ్చుకుంటే ఇక మీదట అన్ని పథకాలకు అర్హులు అని తెలియ జేశారు.

4.ఈ పథకానికి కుల ప్రాదిపదికన మాత్రం ఇవ్వరు.ఏ కులానికి సంబంధించిన వారికైనా (SC,ST,BC,OC ) ప్రభుత్వం చెప్పిన అర్హతలకు లోబడి ఉంటే ఇస్తారు.

Telegram Group Join Now
WhatsApp Group Join Now

5. ఆ కుటుంభంలో ప్రభుత్వ ఉద్యోగి ఉండకూడదు.ఇక్కడ ఔట్సోర్సింగ్ మరియు కాంట్రాక్టు ఉద్యోగులు కి ప్రభుత్వం చెప్పిన ఆదాయానికి లోబడి జీతం పొందుతూ ఉంటే వారందరూ అర్హులే.

6. ఆ కుటుంభానికి వ్యవసాయ మెట్ట భూమి (Dry Land) 10 ఎకరాల లోపు వున్నా,మరియు మాగాణి భూమి (Wet Land) 3 ఎకరాల లోపు వున్న వారందరూ కూడా అర్హులే.

7. ఆ కుటుంభంలో కరెంట్ వాడకం 300 యూనిట్లకు లోబడి వాడుతుండాలి.దీనిని సరాసరి 12 నెలల వాడక యూనిట్లని లెక్కించి ఆ మొత్తం నుండి 12 తో భాగించగా వచ్చే యూనిట్లను మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు.

ఉదాహరణకు: 12 నెలల మొత్తం వాడక యూనిట్లు/12

    2520/12 =210 యూనిట్లు (అర్హులు)

8. ఆ కుటుంభంలోని సభ్యులకు నాలుగు చక్రాల వాహనం ఉండకూడదు.కానీ దీనిలో ట్రాక్టర్,మరియు టాక్సీ లకు మినహాయింపు కలదు.ఎందుకంటే వాటిని కుటుంభం జీవనాధారం కోసం వాడుతుంటారు కావున వీళ్ళు అన్ని పథకాలకు అర్హులు.

9. పట్టణాలలో నివసించేవారికి నివాశిత ఇల్లు 1000 చ.అ కన్నా లోబడి వున్నా వారికీ మాత్రమే ఈ అమ్మఒడి పథకం అందుతుంది.

                                   

Ammavodi Eligibility status check with aadhar card 2023

 

jagananna ammavodi scheme కి సంబంధించి ప్రభుత్వం సూచించిన విధంగా జూన్ నెలలో 4 విడత పంపిణీ కార్యక్రమం ఉంది కనుక ఇంకా దాదాపు ఒక నెల సమయం వుంది కావున ప్రతి ఒక్క తల్లి మీ ఆధార్ నెంబర్ తో ఈ క్రింద చెప్పిన విధంగా మీరు ఈ జూన్ లో వేసే అమ్మఒడి పథకానికి అర్హుల- కాదా అని మీరే చెక్ చేసుకోండి.

 

అర్హతను చెక్ చేసుకునే విధానము 

 

 దీనికి సంబంధిచిన Website Link ఈ క్రింద ఇవ్వబడుతుంది.దాని మీద క్లిక్ చేసుకొండి.

 

     CLICK HERE

 

Jagananna Ammavodi Scheme Eligibility Checker
Jagananna Ammavodi Scheme Eligibility Checker

 

Step 1పై లింక్ పై క్లిక్ చేసున్నాక మరొక పేజీ లోకి వెళుతుంది. అక్కడ Scheme Eligibility పై క్లిక్ చేసుకోవాలి.

Step 2 – ఇక్కడ స్టూడెంట్ తల్లి యొక్క ఆధార్ నెంబర్ మరియు దాని ప్రక్కనే అమ్మ ఒడి అనే ఆప్షన్ ని ఎంచుకుని ఆ తరవాత ఈ ఆర్ధిక సంవత్సరం 2023-24 ని ఎంచుకుని GET DETAILS పై క్లిక్ చేయాలి.

Step 3– ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ని ఎంటర్ చేసుకుని దాని క్రింద వున్నా CAPTHA ని ఎంటర్ చేసుకున్నాక submit చేయాలి.

గమనిక: మొబైల్లో చెక్ చేసుకోవాలి అనుకుంటే Desktop Site ని On చేసుకుని చేసుకోవచ్చు.లేకున్నా పర్లేదు కానీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసేటప్పుడు స్క్రీన్ పూర్తిగా కన్పించదు కావున కనిపించిన కొద్దీ ప్రాంతాన్ని క్లిక్ చేయగా మొబైల్ నెంబర్ ఎంటర్ చేయడానికి అవకాశం వస్తుంది.అది మీకు ఎలా చేయాలో తెలియకపోతే దీని క్రింద ఒక వీడియో పెడతాను,దానిని చూసి ఆ విధంగా చేసుకోండి.

Step 4 ఇక్కడ మొబైల్ కి వచ్చిన OTP  నెంబర్ ని ఎంటర్ చేసుకోవాలి.

Step 5– ఈ పేజీ లో చివరన పైన చెప్పిన అర్హతలు అన్నీ మీ కుటుంబానికి సరిపోయా..లేదా అని చెక్ చేసి చూపిస్తుంది.అక్కడ చూపించిన అన్నీ Satisfied అని వస్తే నిరభ్యంతరంగా మీరు ఈ పథకానికి అర్హులే.కానీ ఒక వేల ఎక్కడైనా మీకు అర్హత వుండి Unsatisfied  అని ఉన్నట్లయితే వెంటనే సంబంధిత అధికారి వద్ద సరిచేసుకోండి.

 

Jagananna Ammavodi Scheme Eligibility Checker
Jagananna Ammavodi Scheme Eligibility Checker

 

 

Eligibility Checker Demo Video 

 

 

 

FAQ

 

1) అమ్మఒడి పథకం కొరకు ఆధార్ కార్డు నందు క్రొత్త జిల్లాల మార్పు చేసుకోవాలా?

 

జ) అధికారికంగా ఎక్కడ కూడా ఈ విధముగా ఉండాలి అనే నిబంధన లేదు.కానీ ఇప్పుడు ప్రతి నెలలో మీ సచివాలయంలో ఆధార్ క్యాంప్ లు నిర్వహిస్తున్నారు కాబట్టి చేసుకుంటే మంచిదే.

మీ ఫోన్ లోనే ఆధార్ లో క్రొత్త జిల్లాలు మార్చుకునే వెసులుబాటు కలదు కావాలంటే దీనికి ఓపెన్ 50/-ల ఖర్చుతో మీరే చేసుకోండి 

 
2) అమ్మఒడి పథకానికి తల్లి యొక్క బ్యాంక్ ఖాతా, ఆధార్ కి లింక్ అయి ఉండాలా ?

 

జ) అవును ఖచ్చితంగా  NPCI లింక్ ఉండాలి.ఎందుకంటే ప్రభత్వం నేరుగా DBT సిస్టం ద్వారా ఆధార్ బేస్ చేసుకుం డబ్బులు వేస్తున్నారు కాబట్టి బ్యాంక్ కి వెళ్లి చేసుకోండి,

ఈ లింక్ ద్వారా NPCI  లింక్ అయిందా లేదా అని మీరే చెక్ చేసుకోండి.

 

3) అమ్మఒడి పథకానికి సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలా?

 

జ) లేదండి, ప్రభుత్వమే పాఠశాలల నుండి సమాచారం ని మరియు 6 దశలలో Online లో వెరిఫికేషన్ చేసి ఆ తర్వాత నేరుగా ప్రాధమిక అర్హుల,అనర్హుల జాబితాలను సచివాలయం కి పంపిస్తారు.అక్కడ దసచివాలయ సిబ్బంది ఫీల్డ్ వెరిఫికేషన్ తాయారు చేసి ప్రభుత్వానికి పంపించగా ఆ తరువాత ఫైనల్ అర్హుల,అనర్హుల లిస్ట్ లు వస్తాయి. 

 

Conclusion

నేను మీ మద్దిమడుగు మునిరత్నం, ఈ అమ్మఒడి పథకానికి సంబంధించి పూర్తి వివరాలను అధికారిక సమాచారం ఆధారంగానే అందించాను.కనుక మీకు పూర్తి సమాచారం అందిచానని తెలియజేస్తూ ఇంకా ఏమైనా మీకు సందేహాలు వున్నావున్నచో పైన ఇచ్చిన Whatsapp గ్రూప్ లో జాయిన్ అయ్యి తెలుపవచ్చును.

 

Related Links

 

ఆధార్ లో క్రొత్త జిల్లాలను మీరె  Online  లో మార్చుకునే విధానము 

ఆధార్ update  History  ని డౌన్లోడ్ చేసుకునే విధానము  

అమ్మఒడి పథకానికి కరెంట్ బిల్ సమస్య వస్తే మీ కుటుంబానికి ఏ మీటర్లు ఉన్నాయో తెలుసుకునే విధానము 

అమ్మఒడి పథకానికి గత సంవత్సరం 2022-23 లో వున్న20 నియమ నిబంధనలు 

know my house mapping details 

 

 

 

 

🔴Related Post