" target="_blank" rel="nofollow">

తిరుపతి పట్టణం లో 4,20,000 జరిమానా వేసిన ట్రాఫిక్ పోలిసులు

Written by Munirathnam

Published on:

తిరుపతి జిల్లా… MR NewsTelugu

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులలో పట్టుబడిన 42 మంది నిందితులకు ఒక్కొక్కరికి రూ.10,000/- ల చొప్పున మొత్తం రూ.4,20,000/- ల జరిమానా.

ప్రజలు ట్రాఫిక్ నియమ నిబంధనలను తప్పకుండా పాటించాలి. అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు.

జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బారాయుడు ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు ట్రాఫిక్ డిఎస్పి రామకృష్ణచారి, కేసుల వివరాలు వెల్లడించారు.

తిరుపతి పట్టణ పరిధిలో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తూ వాహనాలు నడిపిన డ్రైవర్ల పై ట్రాఫిక్ పోలీసు వారు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులను నమోదు చేసి 42 మంది ముద్దాయిలను 4 వ అడిషనల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టు తిరుపతి నందు హాజరు పరచగా గౌరవ జడ్జి శ్రీ గ్రంధి శ్రీనివాస్ గారు ఒక్కొక్కరికి 10,000/- చొప్పున మొత్తం *42 మందికి *4,20,000 /- జరిమానా విధించారు.,
ఈ సంవ్సరం లో 1 కోటి 31 లక్షల 30 వేలు డ్రంకెన్ డ్రైవ్ వల్ల జరిమానా ప్రభుత్వానికి చేరింది.

తిరుపతి ట్రాఫిక్ పోలీసుల పనితీరును జిల్లా ఎస్పీ శ్రీ ఎల్ . సుబ్బరాయుడు, ఐపీఎస్., గారు అభినందించినారు. తిరుపతి నగర ప్రజలకు ట్రాఫిక్ సమస్య తలెత్తకుండ బాధ్యత తో విధులు నిర్వర్తించాలని సూచించారు.#AndhraPradesh #APPolice #AndhraPradeshStatePolice #AndhraPradeshPolice #TirupatiPolice

🔴Related Post