ఈ పేజీ నందు మొట్టమొదటగా Ysr Raithu Bharosa Payment Status గురించి ఎలా చెక్ చేసుకోవాలో చెప్పుకుంటూ దానికి సంబంధించిన పేమెంట్ చెకింగ్ లింక్ అనేది ఈ పేజీ చివరన ఇవ్వడం జరుగుతుంది.కావున అక్కడనుండి ఈ 2023-24 కి సంబంధించి మీ ఖాతాలో డబ్బులు పడ్డాయా లేదా అనే విషయాన్ని మీరే బ్యాంకులకు వెళ్లి చెక్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా మీ ఫోన్ లోనే సులభంగా చెక్ చేసుకోవచ్చును.
Introduction
ఈ Ysr Raithu Bharosa అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం భూమి వున్న రైతులకు పెట్టుబడి సాయంగా సంవత్సరానికి 12,500 ప్రకటించడం జరిగింది. తరువాత అధికారంలోకి వచ్చిన కొద్దిరోజలకి కేంద్ర ప్రభుత్వం కూడా ప్రతి రాష్ట్రానికి రైతులకు సంవత్సరానికి 6000 పెట్టుబడి సాయం చేస్తానని చెప్పడంతో, ఆ అ అమౌంట్ తో పాటు కలిపి YSR రైతు భరోసా-PM కిసాన్ పేరుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం 7500 + కేంద్రప్రభుత్వం 6000 కలిపి మొత్తంగా సంవత్సరానికి ఇప్పడు రూ 13,500 రైతుల ఖాతాలో డైరెక్ట్ గా రైతుల యొక్క బ్యాంక్ ఖాతాలో DBT సిస్టం ద్వారా వేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటి వరకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరూ కలిపి ఈ నాలుగేళ్లలో ఆంధ్రప్రదేశ్ లోని రైతులకు దాదాపు 61,500 కోట్లు ను జమ చేయడం జరిగింది.
ఈ విడతలో ఎంత డబ్బులు వేయనున్నారు ?
అధికారం చేపట్టిన నుండి ఈ 5 విడతగా అమౌంట్ అనేది వెస్తూవుంది,అందులో భాగంగానే ఈ 2023-24 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మే నెలలో రూ 5,500 ను ఈ సంవత్సరానికి మొదట విడత క్రింద కర్నూల్ జిల్లాలోని పత్తికొండ లో ముఖ్యంమత్రి గారు ప్రారంభించడం జరిగింధీ.కావున పైన చెప్పిన విధంగా రాష్ట్రప్రభుత్వం 5,500ను మీ ఖాతాలో జమ చేయడం జరుగుతుంది.
రైతు భరోసాలో మిగిలిన అమౌంట్ ఎప్పుడు పడుతాయి?
రైతు భరోసా అనేది కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా రైతులకు సహాయం చేస్తున్న విషయం మనకు తెలిసిందే. అందులో రాష్ట్ర వాటా 7,500 లో 01-06-2023 న మొదటి విడతగా 5,500 వేయడం జరిగింది,ఇక పోతే PM కిసాన్ పేరుతో ఇదే నెలలో 2000 జమచేస్తారు.దేంతో మొదట విడతగా 7,500 ఇచ్చినట్లు లెక్క అవుతుంది.మిగిలిన అమౌంట్ రాష్ట్ర ప్రభుత్వం 2000, కేంద్ర ప్రభుత్వం 4000 ను ఎప్పుడు ఎన్ని రకాలుగా ఇస్తారుఅనే వివరాలు ఈ క్రింది వీడియో లో స్పష్టంగా చెప్పడం జరిగింది.
ఎవరు ఎంత డబ్బులు, ఏయే నెలలో వేస్తారో తెలుసుకోండి
Ysr Raithu Bharosa Payment Status Checking-2023
Status Link:
( https://ysrrythubharosa.ap.gov.in/RBApp/RB/RBPaymentstatus )
Step 1– పై లింక్ ఓపెన్ చేసాక ఈ క్రింది విధంగా పేజీ ఓపెన్ అవుతుంది.
Step 2- ఇక్కడ ఆ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి Submitt చేస్తే అక్కడ లబ్ధిదారుని పేరు మరియు పేమెంట్ స్టేటస్ ,ఏ బ్యాంక్ లో ఎంత పడిందో అని అక్కడే చూపిస్తుంది.
గమనిక: DBT సిస్టం ద్వారా బట్టన్ నొక్కినా తరువాత కొద్దీ గంటల వ్యవధిలో పేమెంట్ చెక్ చేస్తే Payment Under Process అని వస్తుంధీ.ఆ తరువాత అది అప్డేట్ అయ్యి ఏ బ్యాంక్ లో పడింది ఒక వేల డబ్బులు పడకపోతే reason దగ్గర సరైన కారణాన్నికూడా తెలుపుతారు.కావున ఎవరూ ఆందోళన చెందకుండా మీ సమస్య తెలుసుకుని దానిని సరిచేసుకోవచ్చును.ఎక్కువ శాతం అర్హత లిస్ట్ లో వచ్చాక కూడా అమౌంట్ పడకపోతే ఎక్కువ శాతం NPCI స్టేటస్ అనేది లేకపోవడమే.కనుక దానిని కూడా మీరే సులభంగా ఈ క్రింది లింక్ ద్వారా చెక్ చేసుకోవచ్చును
NPCI STATUS CHECK: Click Here
రైతు భరోసా కి సంబంధించిన సమస్యలు ఎవరికీ చెప్పుకోవాలి?
వైస్సార్ రైతు భరోసాకి సంబంధించి గానీ అదేవిధంగా PM కిసాన్ కి సంబంధించి గానీ ఎలాంటి సమస్యలు వున్నా రాష్ట్రప్రభుత్వం 155251 కి తెలియజేయవలసిందిగా కోరడం అయినది.
Related Links
YSR Bima Renewal & Registration process
Know your family house mapping in gsws