Introduction
ఈ YSR Bima అనేది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దారిద్ర్య రేఖకు దిగువున ఉన్న 1 కోటి 22 లక్షల BPL కుటుంబాలకు లబ్ది చేకూరేటట్టు ఈ పథకాన్ని ప్రవేశ పెట్టింది.ఇందులో కుటుంభంలో సంపాదించే వ్యక్తికి ఏదైనా జరగరానిది జరిగి అతను మరణించిన లేదా శాశ్వత అంగవైకల్యం ఏర్పడినా ఆ కుటుంభం మొత్తము ఇటు ఆర్ధికంగానూ,ఇటు మానసికంగానూ చితికిపోకుండా ప్రభుత్వం తోడుగా ఉండడానికి ఈ వైస్సార్ భీమా ద్వారా ఆర్ధిక భరోసా ఇస్తుంటుంది.దీనికి సంబంధించి కూడా బడ్జెట్ లో సంవత్సరానికి రూ 372 కోట్ల రూపాయలను పెట్టడం జరిగింది. కావున అలాంటి పరిస్థితులు ఎప్పుడు ఎలా ఏర్పడతాయో ఎవ్వరూ ఊహించలేరు కాబట్టి వాలంటీర్స్ అందరూ ఆ నిరుపేద కుటుంబాలను గుర్తించి వారికి తప్పకుండా ఈ భీమా ని రిజిస్టర్ చేయించాలి.ఈ YSR Bima పథకం ద్వారా నేరుగా ఎలాంటి భీమా కంపెనీలు,బ్యాంక్ లకు సంబంధం లేకుండా ప్రభుత్వమే నేరుగా ఆర్ధిక సాయం చేస్తుంటారు.
గమనిక: ఈ Ysr భీమాలో రిజిస్టర్ చేసుకోవాలంటే ఆ పేదవాళ్ళు ఎటువంటి ప్రీమియం కట్టనవసరం లేదు.ఇది పూర్తిగా ఉచితం.
YSR బీమా యొక్క కాల వ్యవధి
జూలై 1వ తేదీ నుండి - జూన్ 30వ తేదీ వరకు ఈ భీమా వర్తిస్తుంది. కనుక మధ్య కాలంలో ఏదైనా రిస్క్ జరిగిన వారికే ఈ ఆర్ధిక సాయం అందుతుంది.కావున ఈ జూన్ లోపల రిజిస్ట్రేషన్స్ మరియు రెన్యువల్స్ ఏదైనా ఉంటే పూర్తి చేసుకోండి.
YSR Bima పరిహారం ఎంత ?
సహజ మరణం: ఈ YSR Bima కొరకు వయస్సు 18 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల లోపల సహజ మరణం పొందినట్లయితే ఒక లక్ష రూపాయలను నామినీ కి అందజేస్తారు.
ప్రమాద భీమా: ఈ YSR Bima కొరకు వయస్సు 18 సంవత్సరాల నుండి 70 సంవత్సరాల లోపల ఉన్న వారికి దురదృష్టవశాత్తు ప్రమాదం జరిగి చనిపోయిన లేదా శాశ్వత అంగవైకల్యం ఏర్పడినా 5 లక్షల రూపాయలను అందిస్తారు.
ఈ YSR భీమా కొరకు రిజిస్ట్రేషన్ పద్ధతి గురించి తెలుసుకుందాం
అర్హతలు
ఈ YSR Bima లో రిజిస్టర్ అవ్వాలంటే కనీస వయస్సు18 పూర్తి అయ్యి 70 సంవత్సరాల లోపల ఉండాలి.వీళ్లు ఖచ్చితంగా BPL కుటుంబాలకు చెందిన వారై ఉండాలి.మరియు కుటుంబం లో సంపాదించే వ్యక్తి (Bread Earner) మాత్రమే ఈ బీమాలో రిజిస్టర్ చేయించాలి. ఈ రిజిస్ట్రేషన్ చేయాలంటే ఖచ్చితంగా ప్రభుత్వం ఇచ్చిన రైస్ కార్డ్ ఉండాలి.
గమనిక: కుటుంభ పోషకుడు అంటే వయస్సులో పెద్దగా వున్న వ్యక్తి అని అర్ధం కాదు.ఆ కుటుంబానికి ప్రధాన జీవనాధారంగా వున్నా వ్యక్తిని కుటుంభ పోషకుడుగా (BE) గుర్తించి వారికి మాత్రమే భీమా చేయాలి.
వయస్సు నిర్దారణ ఎలా చేస్తారు?
ఈ YSR Bima లో వయస్సు నిర్దారణ కొరకు ఆధార్ కార్డ్ లోని వయస్సు ని పరిగణలోకి తీసుకుంటారు.లేదా ఆధార్ సెక్షన్ 7 ప్రకారం ఈ క్రింది వాటిని కూడా పరిగణలోకి తీసుకుని వయస్సుని లెక్కిస్తారు.
నామినీ ని ఎవరిని ఎన్నుకోవాలి?
ఈ YSR Bima పథకం కొరకు కుటుంభంలో సంపాదించే వ్యక్తికి ఈ భీమా అనేది చేస్తారు.వీరిని కుటుంబ పోషకులు అని అంటారు.
వీరికి నామినీ గా క్రమ పద్ధతిలో మొదట ప్రాధాన్యతగా ఈ విధంగా పెట్టాలి.
1) భార్యని పెట్టాలి.
2) భార్య లేని పక్షంలో కొడుకు లేదా కూతురు ని పెట్టాలి.
3) కుటుంబ పోషకుడుకి అవివాహితుడు అయితే తల్లి ని గానీ లేదా తండ్రి ని గానీ నామినీ గా పెట్టాలి.
4) తల్లిదండ్రులు లేకపోతే పెళ్లి కాని సోదరి లేదా వితంతు అయిన సోదరికి నామినీ గా పెట్టాలి.
ఈ భీమా రిజిస్టర్ / రెన్యూవల్ కొరకు ఎప్పటివరకు సమయం ఉంటుంది.
ఈ YSR Bima కి సంబంధించి ఈ మే 31 వ తేదీ నుండి జూన్ 7వ తేదీ లోపల రెన్యూవల్ చేయించాలి అని ప్రభుత్వ అధికారుల నుండి ఆదేశాలు వచ్చాయి.కానీ అప్పటి పనితీరుని ఆధారంగా ఇంకా ఏమైనా పెండింగ్ ఉంటే మరికొంత సమయం కూడా ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.ఏదేమైనా జూన్ చివరికల్లా అన్నీ స్టేజీ లలో వెరిఫికేషన్ పూర్తి అవ్వాల్సి వుంటుంది.
వాలంటీర్ లాగిన్ నందు రిజిస్టర్ మరియు రెన్యూవల్ చేయటం
YSR Bima New App
దీనికి సంబంధించిన ప్రస్తుత Mobile App 5.2 వుంది.ఎప్పుడు అప్డేట్ వచ్చినా ఈ క్రింది లింక్ ద్వారానే డౌన్లోడ్ చేసుకోండి.
DOWNLOAD
YSR Bima SOP: Click Here
ఈ YSR Bima అనేది కుటుంబం లో సంపాదించే వ్యక్తికి బీమా రెన్యూవల్ చేయుటకు మరియు క్రొత్తగా రిజిస్టర్ చేయుటకు సంబంధించిన DEMO VIDEO ని ఇక్కడ ఇస్తాను.దీన్ని చూసి వాలంటీర్స్ చేసుకోగలరు.
Video Coming Soon
ఈ YSR భీమాలో రెన్యూవల్ ప్రాసెస్ లో వాలంటీర్ పాత్ర
ముఖ్యంగా వాలంటీర్స్ రైస్ కార్డ్ ఉన్న ప్రతి కుటుంభంలో రిజిస్ట్రేషన్స్ కి ముందుగానే సంపాదించే వ్యక్తి ని గుర్తించిపెట్టుకోవాలి.వారికి మాత్రమే రిజిస్టర్ మరియు రెన్యువల్ చేయాలి..ఆ సమయంలో వారి దగ్గర నుండి బయోమెట్రిక్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది.
ముఖ్య గమనిక: ఇక్కడ వాలంటీర్స్ గుర్తించుకోవాల్సింది సచివాలయ సిబ్బంది త్వరగా చేయాలని ఒత్తిడి తెచ్చారని లేదా సమయాభావం వల్ల అయినా..ఈ విధంగా ఏ ఇతర కారణాల వలనైనా కుటుంభంలో ఎవరు అందుబాటులో ఉంటే వారికి భీమా రిజిస్ట్రేషన్ / రెన్యూవల్ గానీ చేయకూడదు.ఇలా చేయడం వలన ప్రభుత్వం ఆశించిన ఫలితం లేకుండా ఆ కుటుంభం చాలా నష్టపోవడం జరుగుతుంది.
1) సంపాదించే వ్యక్తి ని కుటుంబ సభ్యుల ఆమోదంతో మార్చుకునే అవకాశం మొబైల్ యాప్ నందు ఇస్తారు.
2) ఇక్కడ భీమా చేసుకున్న వ్యక్తి యొక్క వివరాలు ను మార్చుకునే అన్ని అవకాశాలు మొబైల్ యాప్ లో ఇస్తారు.
నామినీ ని మార్చుకునే విధానము
నామినీ గా ఎవరెవరిని పెట్టుకోవాలో పైన వివరంగా చెప్పడం జరిగింది. కనుక దాని ప్రకారమే క్రమ పద్దతిలో పెట్టుకోవాలి.
1) ఇక్కడ SELF NOMINEE ని మార్చుకునే అవకాశం కూడా ఇస్తారు.
2) నామినీ ని ఒకవేళ మైనర్ ని పెట్టినట్లయితే ఆ వ్యక్తిని సిఫార్సు చేసిన వ్యక్తి యొక్క వివరాలు ఇచ్చి, బయోమెట్రిక్ ద్వారా ఆమోదం తెలుపుకోవాలి.
3) నామినీ కి సంబంధించిన పేరు లో తప్పులు అదే విధంగా వయస్సు,కులం,మతం,బ్యాంక్ అకౌంట్ ఇలా ఏదైనా మార్చుకునే వెసులుబాటు ఇస్తారు.
New Bima Registration Process
ఈ సంవత్సరం క్రొత్తగా రైస్ కార్డ్ వచ్చిన వారికి వాలంటీర్ యొక్క మొబైల్ యాప్ లో ఆటోమేటిక్ గా పేర్లు కనిపించవు.కావున వారి యొక్క Rice Card నెంబర్ ని ఎంటర్ చేసి అందులో BE (Bread Earner) ని ఎంచుకుని సంబంధింత కుటుంబాల్లో నామినీ కూడా ఎంచుకుని అక్కడ కులం,మతం, ప్రాంతం, నామినీ బ్యాంక్ అకౌంట్ ఇలా అన్నీ వివరాలు నమోదు చేయాల్సి వుంటుంది.