తిరుపతి జిల్లా..(MR News telugu)
జిల్లా యస్.పి. గారి ఆదేశాల మేరకు, ముద్దాయిలకి కఠిన శిక్షలు పడేలా చేస్తున్న తిరుపతి పోలీసులు.
– పోక్సో కేసులో ముద్దాయిల కి 10 సంవత్సరాలు జైలు శిక్ష , 22,000/- జరిమానా.
• గుడ్ ట్రయల్ మానిటరింగ్ వ్యవస్థను బలోపేతం చేసి ముద్దాయిలకి కఠిన శిక్షలు పడేలా చేస్తున్న తిరుపతి జిల్లా యస్.పి. శ్రీ ఎల్ .సుబ్బరాయుడు , ఐపీఎస్.,
• జయంపు గ్రామం, బాలాయపల్లి మండల పరిధిలోని జరిగిన పోక్సో కేసులో ముద్దాయి లకి 10 సంవత్సరాలు జైలు శిక్ష , 22,000/- జరిమానా విధించిన గౌరవ పోక్సో కోర్టు జడ్జి గారు, నెల్లూరు.
• మహిళలు, చిన్నారుల పై అత్యాచారం, వేధింపులకు పాల్పడితే కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించిన జిల్లా ఎస్పి గారు.
• బాధితులకు, ఫిర్యాదుదారులకు ఖచ్చితమైన న్యాయం జరిగేలా సాక్ష్యాధారాలను సేకరించి, నేర నిరూపణ చేస్తున్న జిల్లా పోలీసులు.
• జిల్లా పోలీసుల విశేష కృషి వల్ల ఇప్పటికే చాలా కేసులలో నేరస్థులకు శిక్షలు పడుతున్న వైనం.
• గూడూరు సబ్ డివిజన్ బాలయ్య పల్లి పాలస్ స్టేషన్ పరిదిలో ఫిర్యాది పెద్ద కుమార్తె హై స్కూల్ నందు 10 వ తరగతి చదువుతూ వుండిన సమయం లో , ఇనుగుంట గ్రామం ,ఓజిలి మండలానికి చెందిన దండోలు సుబ్బరావు@సుబ్బు జయంపు గ్రామం లో పురుగు మందుల అంగడి లో పని చేసి ఫిర్యాది పెద్ద కుమార్తెకు మాయమాటలు చెప్పి ,పెళ్లి చేసుకుంటాను అని చెప్పి కిడ్నాప్ చేసి తీసుకొని వెళ్ళి ఆమె పై ఆగాయత్యం చేసినాడు అందుకు సహకరించిన అందరి ముద్దాయులకి జైలు శిక్ష .
• కేసు వివరాలు: Cr.no: 55/2015U/s 366(A),376(2)(h),109 IPCSec 6 & 12 of POCSO Act,Sec 3(2)(v) of SC/ST Act.
• తగిన సాక్ష్యాలను పొందుబరచగా ప్రాసిక్యూషన్ వారు నేరం రుజువుచేయడంతో నేడు పోక్సో కోర్టు వారు 10 సంవత్సరాలు జైలు శిక్ష , 22,000/- జరిమానా విధించిన గౌరవ పోక్సో కోర్టు జడ్జి గారు, నెల్లూరు
• ఈ కేసును అప్పటి ఎస్సి /ఎస్టి సెల్ -1 డీఎస్పీ శ్రీ E .శ్రీనివాసులు గారు దర్యాప్తు చేసి చార్జ్ షీట్ దాఖలు చేసినారు. తదుపరి ప్రస్తుత గూడూరు సబ్-డివిజనల్ పోలీసు ఆఫీసర్ శ్రీ V .V .రమణ కుమార్ , C.I శ్రీ A .V .రమణ మరియు SI శ్రీ K. గోపి గార్లు సాక్ష్యాలను పొందుబరిచారు.
• ముద్దాయి పేరు (శిక్ష పడిన వారు):
1. దండోలు సుబ్బరావు@సుబ్బు , తండ్రి : పుల్లయ్య , వయస్సు : 32 సం., కులం : మాల, ఇనుగుంట గ్రామం ,ఓజిలి మండలం , తిరుపతి జిల్లా(A.1)
2. కొగిలి సుబ్రమణ్యం @మణి ,తండ్రి : వెంకటరామనయ్య , వయస్సు : 37 సం., కులం : మాల, కొత్తపాలెం గ్రామం ,బుచ్చినాయుడు కండ్రిగ మండలం , తిరుపతి జిల్లా.(A.2)
3. యల్లంటి వెంకటయ్య ,తండ్రి : అంకయ్య , వయస్సు : 47 సం., కులం : మాల, ఇనుగుంట గ్రామం ,ఓజిలి మండలం , తిరుపతి జిల్లా(A.5).
4. మంగులూరు వాణి ,భర్త : శివ ప్రసాద్ , వయస్సు : 39 సం., కులం : వైశ్య , జయంపు గ్రామం ,బాలాయపల్లి మండలం , తిరుపతి జిల్లా(A.6)
• సదరు కేసును నెల్లూరు జిల్లా పోక్సో కోర్టు గౌరవ జడ్జి శ్రీమతి సిరిపిరెడ్డి సుమ గారు విచారణ పూర్తి చేసి నేడు ప్రతి ముద్దాయికి 10 సంవత్సరాలు జైలు శిక్ష , 22,000/- జరిమానా విధించిన గౌరవ పోక్సో కోర్టు జడ్జి గారు, నెల్లూరు..
ఈ కేసు నిరూపణకు కృషిచేసిన కోర్టు పిపి మరియు పోలీస్ అధికారులు సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ రియల్ సుబ్బరాయుడు ఐపిఎస్.,గారు. #AndhraPradesh #APPolice #AndhraPradeshStatePolice #AndhraPradeshPolice #TirupatiPolice