మీ మొబైల్లో అవసరంలేని ఫొటోస్,వీడియోస్ వల్ల phone storage నిండిపోతుందా..అయితే ఈ సెట్టింగ్ On చేసుకోండి?

Written by Munirathnam

Published on:

మీ మొబైల్ లో అవసరంలేని ఫొటోస్, వీడియోస్ వల్ల ఫోన్ స్టోరేజీ (Phone Storage) నిండిపోతుందా..అయితే ఈసెట్టింగ్ OFF చేసుకోండి?

 

Tech With Munirathnam

 

      Phone Storage –  మన మొబైల్ లో అనవసరమైన డేటా మొత్తం ఉండిపోవడం వలన మన మొబైల్ స్టోరేజీ (Phone Storage) నిండిపోయి,మొబైల్ కూడా స్లోగా పని చేస్తుంటుంది. దీనికి చాలా రకాలైన కారణాలు అయితే వున్నాయి. అందులో ఒకటిగా చెప్పుకుంటే “ప్రస్తుత కాలంలో స్మార్ట్ ఫోన్ వున్న ప్రతి ఒక్క యూజర్ కూడా వాట్సాప్ ని విరివిగా వాడతుంటారు. కనుక అందులో రాజకీయ సంబంతిత  గ్రూప్ లలో జాయిన్ అయి ఉండడం వలన చాలా ఫోటోలు మరియు వీడియోలు మనకు అవసరం లేకున్నా కూడా ఆటోమేటిక్ గా డౌన్లోడ్ అయిపోయి మన ఫోన్ స్టోరేజీలో (Phone Storage) ఉండిపోతుంది”. కనుక ఇప్పుడు మనం ఈ పేజీ లో చెప్పబోయే settings ని OFF చేసుకోవడం ద్వారా మీకు అవసరమైనవి మీ అనుమతితో డౌన్లోడ్ చేయడం తప్ప, వేరే ఏ ఫొటోస్, వీడియోస్ కూడా మీ ఫోన్ స్టోరేజి (Phone Storage) లోకి రావు.

 

   ఇలాంటి Technology కి సంబంధిచిన సమాచారం మరియు ప్రభుత్వ పథకాల పై ఎప్పటికప్పుడు ప్రభుత్వం నుండి అధికారిక సమాచారం తెలుసుకోవాలి అనుకుంటే మనకు సంబంధించిన ఈ క్రింది వాట్సాప్ గ్రూప్ లలో జాయిన్ అయిది డైలీ అప్డేట్స్ వస్తుంటాయి. కనుక తద్వారా మీరు త్వరగా తెలుసుకుని ఆ పథకాల ద్వారా సరైన సమయానికి లబ్ది పొందవచ్చును.

WHATSAPP GROUP

 

 

వాట్సాప్ లో ఈ క్రింది విధంగా సెట్టింగ్స్ చేసుకోగలరు. (Phone Storage)

 

phone storage

 

ముందుగా మీ వాట్సాప్ ఓపెన్ చేసుకుని, క్రింది ఫోటో లో చూపించిన విధంగా కుడి వైపున వున్న 3 Dots పై క్లిక్ చేసుకుని Settings ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి.

 

  • ఆ తరువాత మన ప్రొఫైల్ ఫోటో తో కూడిన వివరాలు వస్తాయి. అక్కడ Storage and data అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి.
  • ఇక్కడ Media auto -Download అనే ఆప్షన్ దగ్గర 3 ఒప్షన్స్ ఉంటాయి.
  1. When using mobile Data – ఈ ఆప్షన్ పై క్లిక్ చేసుకుని photos, audio, videos, Documents అనే ఆప్షన్ అన్ని కూడా Tick లేకుండా OFF చేసి పెట్టుకోండి.తద్వారా మీ వాట్సాప్ గ్రూప్ లలో వచ్చే ఫొటోస్ మీరు చూసుకుని,ఏది కావాలని కోరుకుంటారో వాటిని మాత్రమే download చేసుకోవచ్చు. మిగతా ఏవి కూడా మీ ఫోన్ లో వచ్చి చేరవు.
  2. When Connected on Wi-fi -ఈ ఆప్షన్ పై క్లిక్ చేసుకుని photos, audio, videos, Documents అనే ఆప్షన్ అన్ని కూడా Tick లేకుండా OFF చేసి పెట్టుకోండి.
  3. When Roaming – ఈ ఆప్షన్ పై క్లిక్ చేసుకుని photos, audio, videos, Documents అనే ఆప్షన్ అన్ని కూడా Tick లేకుండా OFF చేసి పెట్టుకోండి.

 

 

Related Links 

 

  1. బాసర IIIT నోటిఫికేషన్ – CLICK HERE 

🔴Related Post